Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplab0093fc-5e3e-4f51-a942-f56514df55c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplab0093fc-5e3e-4f51-a942-f56514df55c9-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. చివర్లో వచ్చి ధోని ఆడేది కొన్ని బంతులు అయినప్పటికీ ఆ కొన్ని బంతుల్లోనే అతను సృష్టించే విధ్వంసం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక ధోని బౌలింగ్ చేసిన బౌలర్ కి ఒక పీడకల లాంటి రోజు అతని కెరియర్లో మిగిలిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఆ రేంజ్ లో విధ్వంసం ఉంటుంది. ఒత్తిడి సమయంలోకూడా ధోని జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఫినిషర్ అనే పదం వినిపIpl{#}England;Cricket;Yuva;MS Dhoniధోనిని చూసి.. యంగ్ ప్లేయర్స్ అది నేర్చుకోవాలి : పీటర్సన్ధోనిని చూసి.. యంగ్ ప్లేయర్స్ అది నేర్చుకోవాలి : పీటర్సన్Ipl{#}England;Cricket;Yuva;MS DhoniFri, 28 Apr 2023 15:00:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. చివర్లో వచ్చి ధోని ఆడేది కొన్ని బంతులు అయినప్పటికీ ఆ కొన్ని బంతుల్లోనే అతను సృష్టించే విధ్వంసం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక ధోని బౌలింగ్ చేసిన బౌలర్ కి ఒక పీడకల లాంటి రోజు అతని కెరియర్లో మిగిలిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఆ రేంజ్ లో విధ్వంసం ఉంటుంది. ఒత్తిడి సమయంలోకూడా ధోని జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఫినిషర్ అనే పదం వినిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరికి ధోని నే గుర్తుకు వస్తూ ఉంటాడు.



 అలాంటి ధోని ప్రస్తుతం 41 ఏళ్ళ వయసులో కూడా ఐపీఎల్ లో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని రీతిలో తన బ్యాటింగ్లో మెరుపులు మెరూపిస్తూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికి తనలో క్రికెట్ ఆడే సత్తా తగ్గలేదు అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ లో నిరూపిస్తున్నాడు. ఆడిన కొన్ని బంతుల్లోనే సిక్సర్లు పోర్లతో వీర విహారం చేస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ధోని బ్యాటింగ్ గురించి ఇటీవల స్పందించిన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ధోనీని చూసి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి అంటూ ఒక సలహా కూడా ఇచ్చాడు.



 కఠినమైన సమయాల్లో మ్యాచ్లను ఎలా ముగించాలి అన్న విషయాన్ని మహేంద్రసింగ్ ధోని ని చూసి నేర్చుకోవాలి అంటూ సూచించాడు. అందరూ యువ ఆటగాళ్లు ధోని చేజింగ్ మంత్రాను ఫాలో కావాలి అంటూ తెలిపాడు. 200 కు పైగా పరుగులను ఛేదించే సమయంలో ఎలా నిలబడి జట్టును గెలిపించాలో ధోని ఆటను చూసి నేర్చుకోవాలి.. ఇటీవల కాలంలో ఎంతోమంది బ్యాట్స్మెన్లు ఆటను త్వరగా ముగించాలనే తొందరలో అవుట్ అవుతున్నారని కెవిన్ పీటర్సన్ కామెంట్ చేశాడు. అయితే కెవిన్ పీటర్సన్ చెప్పినట్లుగానే ఈ ఏడాది ఐపీఎల్ లో ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం తక్కువ సార్లే వచ్చినప్పటికీ.. అతను ఆడిన కొన్ని బంతుల్లోనే సిక్సర్లతో చెలరేగిపోతున్నాడు మహేంద్రడు.



RRR Telugu Movie Review Rating

'NTR30' పై ఫ్యాన్స్ కి నమ్మకం లేదా..?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>