MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr156341f1-b4cc-4d0e-abb4-5e6e16ea1ee4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr156341f1-b4cc-4d0e-abb4-5e6e16ea1ee4-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప ది రూల్'మూవీ కోసం సినీ ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. అయితే తాజాగా హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 సెట్స్ కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని కలిసారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుష్ప 2 సెట్స్ లో తారక్ కనిపించడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ NTR{#}Ramoji Film City;Party;Allu Arjun;sukumar;kushi;Kushi;Audience;India;bollywood;media;Janhvi Kapoor;Jr NTR;NTR;koratala siva;Cinema'పుష్ప2' సెట్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్.. ఎందుకు వెళ్ళాడో తెలుసా..?'పుష్ప2' సెట్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్.. ఎందుకు వెళ్ళాడో తెలుసా..?NTR{#}Ramoji Film City;Party;Allu Arjun;sukumar;kushi;Kushi;Audience;India;bollywood;media;Janhvi Kapoor;Jr NTR;NTR;koratala siva;CinemaThu, 27 Apr 2023 15:29:24 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప ది రూల్'మూవీ కోసం సినీ ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. అయితే తాజాగా హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 సెట్స్ కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని కలిసారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుష్ప 2 సెట్స్ లో తారక్ కనిపించడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారుతుంది. 

అయితే పుష్ప సెట్స్ కి ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళాడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ ఫోటో వైరల్ అవ్వడంతో దీన్ని చూసి కొంతమంది పుష్ప పార్ట్ 2 లో ఎన్టీఆర్ గెస్ట్అపీరియన్స్ ఇస్తున్నాడని.. అందుకే ఇలా సెట్స్ కి వచ్చాడని అంటుంటే.. మరి కొంతమంది ఏమో బన్నీ, తారక్ ఇద్దరు కలిసి పార్టీ చేసుకోవడం కోసం తారక్  బన్నీని పుష్ప సెట్స్ లో కలిసారని చెబుతున్నారు. కానీ అసలు ఎన్టీఆర్ ఎందుకు పుష్ప సెట్స్ కి వెళ్ళాడనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే ఈ ఫోటోతో అటు బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. నిజంగానే పుష్ప2 లో ఎన్టీఆర్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఇరువురి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. దానికి మించి పుష్ప 2 ను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇక షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమాని వచ్చేయడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక తారక్ విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నాడు తారక్. బాలీవుడ్ ముద్దుగమ్మ జాన్వి కపూర్మూవీ తోనే వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చేయడాది వేసవి కానుకగా విడుదల కానుంది...!!



RRR Telugu Movie Review Rating

'విరుపాక్ష' డైరెక్టర్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్..?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>