MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi96161d77-66cc-4286-9384-f4feadcd1b49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi96161d77-66cc-4286-9384-f4feadcd1b49-415x250-IndiaHerald.jpgవరసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి స్పీడ్ ను టాప్ యంగ్ హీరోలు కూడ తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ మూవీలో నటిస్తున్న చిరంజీవి ఈమూవీ షూటింగ్ ను త్వరలో ముగించబోతున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం చిరంజీవి వెంకీ కుడుముల దర్శకత్వంలో మూవీని చేయవలసి ఉంది. అయితే ఈమూవీ కథ చిరంజీవికి పూర్తిగా నచ్చకపోవడంతో ఆప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి దగ్గర అనేక ఆప్క్షన్స్ ఉండటంతో అనేకమంది దర్శకులు చెపుతున్న కథలను మెగా స్టార్ వింటున్నాడు. యంగ్ డైరెchirangeevi{#}Kumaar;meher ramesh;srikanth;sudhakar;Chiranjeevi;ravi anchor;krishna;March;News;Darsakudu;Directorదసరా దర్శకుడికి టార్గెట్ ఇచ్చిన చిరంజీవి !దసరా దర్శకుడికి టార్గెట్ ఇచ్చిన చిరంజీవి !chirangeevi{#}Kumaar;meher ramesh;srikanth;sudhakar;Chiranjeevi;ravi anchor;krishna;March;News;Darsakudu;DirectorThu, 27 Apr 2023 09:00:00 GMTవరసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి స్పీడ్ ను టాప్ యంగ్ హీరోలు కూడ తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ మూవీలో నటిస్తున్న చిరంజీవి ఈమూవీ షూటింగ్ ను త్వరలో ముగించబోతున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం చిరంజీవి వెంకీ కుడుముల దర్శకత్వంలో మూవీని చేయవలసి ఉంది. అయితే ఈమూవీ కథ చిరంజీవికి పూర్తిగా నచ్చకపోవడంతో ఆప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.


ప్రస్తుతం చిరంజీవి దగ్గర అనేక ఆప్క్షన్స్ ఉండటంతో అనేకమంది దర్శకులు చెపుతున్న కథలను మెగా స్టార్ వింటున్నాడు. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ బీవీఎస్ రవి కళ్యాణ్ కృష్ణ ప్రసన్న కుమార్ ఇలా అనేకమంది దర్శకులు చిరంజీవికి కథ చెప్పి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యలో పూరీ జగన్నాథ్ కూడ చిరంజీవికి ఒక కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మెగా స్టార్ కు ఈదర్శకులు చెప్పిన ఏకథ పూర్తిగా నచ్చకపోవడంతో ఈదర్శకులు అంతా చిరంజీవి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.


ఇప్పుడు ఈలిస్టులోకి తాజాగా మరొక దర్శకుడు వచ్చి చేరాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ‘దసరా’ మూవీతో బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల పై చిరంజీవి దృష్టి పడింది అంటున్నారు. ‘దసరా’ ను తీసిన సుధాకర్ చెరుకూరికే మరొక సినిమాను తీస్తానని శ్రీకాంత్ ‘దసరా’ విడుదల అవ్వకముందు మాట ఇచ్చాడు అని అంటారు.


‘దసరా’ సూపర్ హిట్ అయినతరువాత శ్రీకాంత్ తాను ఇచ్చిన మాట ప్రకారం సుధాకర్ చేరుకూరికి మరొక సినిమాను తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఈప్రయత్నాలలో భాగంగా దర్శకుడు శ్రీకాంత్ మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ సంపాదించడం అక్కడ చిరంజీవికి ఒక కథ చెప్పడం జరిగింది అంటున్నారు. శ్రీకాంత్ చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవికి బాగా నచ్చడంతో ఆకథను బాగా డెవలప్ చేసి స్క్రిప్ట్ గా మార్చి తనను కలవమని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో రంగంలోకి దిగిన శ్రీకాంత్ తనకు పరిచయం ఉన్న మంచి రైటర్లతో కలిసి కథకు సంబంధించిన స్క్రిప్ట్ ను తయారుచేసే పనిలో బిజీ అయినట్లు వార్తలు వస్తున్నాయి..  






RRR Telugu Movie Review Rating

జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చెల్లె షర్మిల?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>