SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-20230bfb88b1-6261-4e35-870f-ddbb6b0021a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-20230bfb88b1-6261-4e35-870f-ddbb6b0021a6-415x250-IndiaHerald.jpgఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ గురువారం నాడు అనగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఇంకా అదే సమయంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ మొత్తం 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు మాత్రం రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగుతుందనIPL 2023{#}Rajasthan;thursday;Chennai;MS DhoniRR vs CSK: రెండు సూపర్ టీమ్స్.. గెలిచేది ఎవరంటే?RR vs CSK: రెండు సూపర్ టీమ్స్.. గెలిచేది ఎవరంటే?IPL 2023{#}Rajasthan;thursday;Chennai;MS DhoniThu, 27 Apr 2023 15:16:00 GMTఐపీఎల్ 2023 సీజన్లో  చెన్నై సూపర్ కింగ్స్ గురువారం నాడు అనగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఇంకా అదే సమయంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ మొత్తం 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు మాత్రం రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగుతుందని భావిస్తున్నారు.ఇక రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించినట్టు పలు గణాంకాలు చెబుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 15 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. అయితే సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై మొత్తం 13 సార్లు విజయం సాధించింది.


ఇంకా అదే సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫామ్‌ను కనుక పరిశీలిస్తే రాజస్థాన్‌ రాయల్స్‌ టీం పైనే పైచేయి సాధించాలని భావిస్తోంది. అయితే మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.ఇక జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ కానుంది. అలాగే మరోవైపు ఈ వికెట్ గురించి మాట్లాడుకుంటే బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్‌కు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్యాట్స్‌మెన్ స్కోర్ చాలా ఈజీగా పరుగులు చేస్తారు. అయితే బౌలర్లు మంచి లైన్, లెంగ్త్ ని పొందుతారు. అయితే ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ పరుగులు చేయాలంటే వికెట్‌పైనే ఎక్కువ టైం గడపాల్సి ఉంటుంది.ఇంకా అలాగే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. దీంతో పాటు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం బౌండరీలు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి.మరి చూడాలి ఈరోజు ఏ టీం విజయం సాధిస్తుందో ఏ టీం ఓడిపోతుందో..



RRR Telugu Movie Review Rating

'ఏజెంట్' ఫస్ట్ రివ్యూ.. సినిమాకు అవే పెద్ద మైనస్ లు..!!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>