MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-e153f4a6-ca28-4d44-b182-df17a5278e3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-e153f4a6-ca28-4d44-b182-df17a5278e3e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా గోపీచంద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి డైరెక్టర్ టి కృష్ణ తనయుడుగా 2001లో 'తొలివలపు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. అయితే మొదటి సినిమా నిరాశపర్చడంతో ఆ తర్వాత జయం, నిజం, వర్షం వంటి సినిమాలలో విలన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లక్ష్యం,శౌర్యం, గోలీమార్, లౌక్యం, సాహసం వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా గోపీచంద్ వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ 'రామబGopichand {#}srivas;vennela kishore;School;Varsham;Loukyam;krishna;netizens;media;Hero;Director;Cinemaగోపిచంద్ ఇప్పటికీ తన పిల్లల్ని బస్సులోనే స్కూల్ కి పంపుతాడట.. ఎందుకో తెలుసా..?గోపిచంద్ ఇప్పటికీ తన పిల్లల్ని బస్సులోనే స్కూల్ కి పంపుతాడట.. ఎందుకో తెలుసా..?Gopichand {#}srivas;vennela kishore;School;Varsham;Loukyam;krishna;netizens;media;Hero;Director;CinemaThu, 27 Apr 2023 17:10:24 GMTటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా గోపీచంద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి డైరెక్టర్ టి కృష్ణ తనయుడుగా 2001లో 'తొలివలపు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. అయితే మొదటి సినిమా నిరాశపర్చడంతో ఆ తర్వాత జయం, నిజం, వర్షం వంటి సినిమాలలో విలన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లక్ష్యం,శౌర్యం, గోలీమార్, లౌక్యం, సాహసం వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా గోపీచంద్ వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ 'రామబాణం' సినిమా పైనే ఉన్నాయి. 

గోపీచంద్ తో లక్ష్యం, లౌక్యం సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీవాస్ ఈ మూవీని తెరకెక్కించాడు. గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, కుష్బూ, శుభలేఖ సుధాకర్, నాజర్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. మే 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2013లో రేష్మతో వివాహం చేసుకున్న గోపీచంద్ కి ఇద్దరు పిల్లలు అనే విషయం తెలిసిందే.

అయితే తాజాగా తన పిల్లల పెంపకం గురించి గోపీచంద్ మాట్లాడుతూ తన పిల్లలు ఇప్పటికీ కూడా బస్సులోనే స్కూల్ కి వెళ్తారని చెప్పాడు.' నా పిల్లల్ని ఇప్పటికీ బస్సులోనే స్కూల్ కి పంపుతాను. కారులో అసలు పంపను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఎంతపడితే ఎంత ఇచ్చేయను. ఎందుకంటే వాళ్లకు కూడా రియాలిటీ ఏంటో తెలియాలి కదా. వాళ్లు కూడా అందరితో కలవడం నేర్చుకోవాలి కదా' అని చెప్పుకొచ్చాడు గోపిచంద్.ప్రస్తుతం గోపిచంద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో ని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేస్తున్నా.. తన పిల్లలు మాత్రం సాధారణ జీవితంతోనే అన్నీ తెలుసుకొని పైకి రావాలని గోపీచంద్ ఆలోచించడం నిజంగా చాలా గ్రేట్ అంటూ  సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేస్తున్నారు...!!



RRR Telugu Movie Review Rating

'ఏజెంట్' ఫస్ట్ రివ్యూ.. సినిమాకు అవే పెద్ద మైనస్ లు..!!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>