MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yash12ebaf3d-6168-4ccf-b620-0cfc0812b0c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yash12ebaf3d-6168-4ccf-b620-0cfc0812b0c8-415x250-IndiaHerald.jpgకే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై.. ఒకదానికి మించి మరొకటి సంచలన విజయాలను అందుకున్నాయి. ఇక అప్పటివరకు కన్నడలో చిన్న హీరోగా ఉన్న యష్.. కే జి ఎఫ్ తో రాకింగ్ స్టార్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కేజీఎఫ్ తర్వాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాని ప్రకటించలేదు ఈ కన్నడ హీరో. ఆ మధ్య మన సౌత్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్,శంకర్ యష్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ వాటYash{#}geetha;prashanth neel;Prasanth Neel;KGF;puri jagannadh;Yash;Kannada;Director;News;Cinema;Indiaస్టార్ హీరోయిన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న కేజీఎఫ్ హీరో..?స్టార్ హీరోయిన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న కేజీఎఫ్ హీరో..?Yash{#}geetha;prashanth neel;Prasanth Neel;KGF;puri jagannadh;Yash;Kannada;Director;News;Cinema;IndiaThu, 27 Apr 2023 15:00:31 GMTకే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై.. ఒకదానికి మించి మరొకటి సంచలన విజయాలను అందుకున్నాయి. ఇక అప్పటివరకు కన్నడలో చిన్న హీరోగా ఉన్న యష్.. కే జి ఎఫ్ తో రాకింగ్ స్టార్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కేజీఎఫ్ తర్వాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాని ప్రకటించలేదు ఈ కన్నడ హీరో. ఆ మధ్య మన సౌత్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్,శంకర్ యష్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ వాటిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. 

అయితే యష్ మాత్రం  కే జి ఎఫ్ తో తన ఇమేజ్ ఓ రేంజ్ లో పెరగడంతో కే జి ఎఫ్ ని మించే కథ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోసారి మాఫియా బ్యాక్ డ్రాప్ తో కూడిన యూనివర్సల్ అప్పీల్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నాడు. ఇక తాజాగా కే జి ఎఫ్ ను నిర్మించిన హోంబలే సంస్థ 'కే జి ఎఫ్ చాప్టర్ 3' కూడా ఉండబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చాప్టర్ 3 సెట్స్ పై కి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలోనే యష్ తదుపరి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే యష్ తన నెక్స్ట్ మూవీని మలయాళ నటి, దర్శకురాలు అయినా గీత మోహన్ దాస్ దర్శకత్వంలో చేయబోతున్నారట.

ఇప్పటికే గీత మోహన్దాస్ డైరెక్షన్లో మూడు సినిమాలు వచ్చాయి. తాజాగా ఈమె యష్ కి ఓ మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న కథను వినిపించిందట. ఆ కథ యష్ కి బాగా నచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్టుకి యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ లేడీ డైరెక్టర్ తో కేజీఎఫ్ హీరో సినిమా చేయబోతున్నాడు అంటే కచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే...!!



RRR Telugu Movie Review Rating

ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "ఏజెంట్" మూవీ..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>