HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/children-s-mobile-use2b5827a8-0fc9-4c4b-ab62-8004fcfaa54a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/children-s-mobile-use2b5827a8-0fc9-4c4b-ab62-8004fcfaa54a-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఫోన్ చూడడం అలవాటుగా మారిపోయింది.ముఖ్యంగా పిల్లల్లో కరోనా పుణ్యమా అని,ఆన్లైన్ క్లాసులు,వీడియో గేమ్స్,యూట్యూబ్ వీడియోస్ అంటూ చాలా రకాలుగా ఫోన్లను చూస్తూనే ఉంటారు.ఇది మొదటగా బాగానే ఉన్నా క్రమంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయని సైకాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు.ఆ అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉబకాయం.. పిల్లలు వీడియో గేమ్స్,వెబ్ సిరీస్,యూట్యూబ్,టీవీ చూసుకుంటూ, అక్కడే ఒకే చోట కదలకుండా కూర్చొని ఉంటారు.దానివల్ల శారీరక శ్రమ లేక,అధిక బరువు పెCHILDREN'S MOBILE;USE{#}Smart phone;Coronavirusపిల్లలు అతిగా ఫోన్ చూస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు..!!పిల్లలు అతిగా ఫోన్ చూస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు..!!CHILDREN'S MOBILE;USE{#}Smart phone;CoronavirusThu, 27 Apr 2023 06:00:00 GMTఈ మధ్యకాలంలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఫోన్ చూడడం అలవాటుగా మారిపోయింది.ముఖ్యంగా పిల్లల్లో కరోనా పుణ్యమా అని,ఆన్లైన్ క్లాసులు,వీడియో గేమ్స్,యూట్యూబ్ వీడియోస్ అంటూ చాలా రకాలుగా ఫోన్లను చూస్తూనే ఉంటారు.ఇది మొదటగా బాగానే ఉన్నా క్రమంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయని సైకాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు.ఆ అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉబకాయం..
పిల్లలు వీడియో గేమ్స్,వెబ్ సిరీస్,యూట్యూబ్,టీవీ చూసుకుంటూ, అక్కడే ఒకే చోట కదల కుండా కూర్చొని ఉంటారు.దానివల్ల శారీరక శ్రమ లేక,అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాంటి పిల్లలు ఉబకాయం వచ్చి,అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు.

కంటిసమస్యలు..
ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ గా చూడడం వల్ల,కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే జబ్బు రావడం కాయం.మరియు కంటి చూపు తగ్గడం, కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

 మానసిక సమస్యలు..
ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ, అనుబంధాలకి తావివ్వకుండా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మరియు వారిలో కరుణ జాలి దయ అనే అంశాలు క్రమంగా తగ్గుతూ వస్తాయి. కావున పెద్దలేవి వారికి అవగాహన కలిగించి బంధాల గురించి తెలియజేస్తూ ఉండాలి.

నిద్రలేమి..
ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ నుంచి వచ్చే నీలి కిరణాలు కళ్ళపై పడటం వల్ల, శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టక నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవాల్సి  వస్తుంది.కావున ఫోన్, కంప్యూటర్, లాప్ టాప్ వంటివి నిద్రకు గంట ముందే వాడకుండా ఉండడం మంచిది.

జీర్ణ సమస్యలు..
ఫోన్ చూస్తూ భోజనం చేయడం ద్వారా, మెదడు సంకేతాలను పంపలేదు.దానితో ఏమి తింటున్నారో , ఎంత తింటున్నారో ఏమీ తెలియకుండా తినేస్తుంటారు.అలాంటప్పుడు జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక,జీర్ణ సమస్యలు మొదలవుతాయి.

మెడ, వెన్ను నొప్పులు..
ఫోన్ చూసే వారు కదలకుండా,పొజిషన్ మార్చకుండా ఒకే చోట, ఒకే వైపు చూస్తూ కూర్చుంటే, వారికి క్రమంగా వెన్ను మరియు మెడ నొప్పులు వచ్చే అవకాశం వుంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : మహానాడులో కీలక ప్రకటన ?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>