MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk10875077e94-31eb-4067-a252-915090f3e56e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk10875077e94-31eb-4067-a252-915090f3e56e-415x250-IndiaHerald.jpgబాలయ్య సినిమా అంటే యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉండాల్సిందే. చాలామంది ఆడియన్స్ ఫ్యాన్స్ ఆయన సినిమాకి వెళ్ళేది ఆయన చేసే ఫైట్స్, చెప్పే డైలాగ్స్ కోసమే. ఇప్పటివరకు బాలయ్య నటించిన ఏ సినిమాలో చూసుకున్న్నా అందులో యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో బాలయ్య 'NBK 108' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాదులో చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో కూడా ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. సినిమాలోని ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుNBK108{#}anil ravipudi;kajal aggarwal;Balakrishna;Audience;Heroine;Cinema;Rajamouli;Director;NewsNBK108: వెయ్యి మందితో బాలయ్య ఫైట్.. ఇక దబిడి దిబిడే..?NBK108: వెయ్యి మందితో బాలయ్య ఫైట్.. ఇక దబిడి దిబిడే..?NBK108{#}anil ravipudi;kajal aggarwal;Balakrishna;Audience;Heroine;Cinema;Rajamouli;Director;NewsWed, 26 Apr 2023 17:04:55 GMTబాలయ్య సినిమా అంటే యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉండాల్సిందే. చాలామంది ఆడియన్స్ ఫ్యాన్స్ ఆయన సినిమాకి వెళ్ళేది ఆయన చేసే ఫైట్స్, చెప్పే డైలాగ్స్ కోసమే. ఇప్పటివరకు బాలయ్య నటించిన ఏ సినిమాలో చూసుకున్న్నా అందులో యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో బాలయ్య 'NBK 108' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాదులో చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో కూడా ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. సినిమాలోని ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

తాజా సమాచారం ప్రకారం NBK 108 లో సుమారు 1000 మందితో ఓ భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ను బాలయ్య పై ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఒకప్పుడు సినిమాలో 20 మంది ఉంటే దాన్ని భారీ ఫైట్ అనేవాళ్ళు. అయితే తర్వాత రాజమౌళి మగధీరతో ఆ లెక్క ని వందకు చేర్చాడు. ఇక ఈమధ్య వంద కూడా దాటేసి భారీ యాక్షన్ సీన్లు మనకు తెరపై కనిపిస్తున్నాయి. అలా చూసుకుంటే త్రిబుల్ ఆర్, కే జిఎఫ్ లాంటి సినిమాల్లో హీరోలు వందల మందిని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు బాలయ్యతో కూడా అలాంటి భారీ ఫైట్ సీన్ ప్లాన్ చేశారట. బాలయ్య కూడా వెయ్యి మందిని కొట్టాలని అనిల్ రావిపూడి ఓ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ను డిజైన్ చేశాడట.

ఇక ఈ ఫైట్ సీన్లో ఏకంగా 1000 మంది ఫైటర్స్ కనిపిస్తారట.ఈ సీన్ లో బాలయ్య యాక్షన్ అయితే బీభత్సంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి సినిమాలో ఈ రేంజ్ లో ఫైట్ సీక్వెన్స్ లేదు. అయితే బాలయ్య సినిమా కోసం మాత్రం అనిల్ రావిపూడి వెయ్యి మందితో ఫైట్స్ సీన్ ని తీస్తుండడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు  పెరిగిపోయాయి. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ ఫైట్స్ సీక్వెన్స్ చిత్రీకరణ ఉంటుందట. దాదాపు 15 రోజుల పాటు ఈ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తారంట.ఇక ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. సైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరో యంగ్ హీరోయిన్ శ్రీలీలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది...!!



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: అయ్యగారు ఆ టార్గెట్ కొడతారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>