Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl6b9948ed-d420-4135-99fd-8fdd09c12223-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl6b9948ed-d420-4135-99fd-8fdd09c12223-415x250-IndiaHerald.jpgరాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు అటు నాలుగు మ్యాచ్లలో విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది అని చెప్పాలి. అయితే డూప్లెసిస్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక అతనికి గాయం కావడంతో పాత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ సారధ్యంలో రెండు మ్యాచ్లు ఆడి విజయం సాధించింది. అయితే ఇక నేడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో బెంగళూరు Ipl{#}Audi;Avunu;VIRAT KOHLIడేంజర్ జోన్ లో కోహ్లీ.. అలా జరిగితే నిషేధమే?డేంజర్ జోన్ లో కోహ్లీ.. అలా జరిగితే నిషేధమే?Ipl{#}Audi;Avunu;VIRAT KOHLIWed, 26 Apr 2023 12:00:00 GMTరాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు అటు నాలుగు మ్యాచ్లలో విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది అని చెప్పాలి. అయితే డూప్లెసిస్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక అతనికి గాయం కావడంతో పాత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ సారధ్యంలో రెండు మ్యాచ్లు ఆడి విజయం సాధించింది.



 అయితే ఇక నేడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో బెంగళూరు జట్టు మరో రసవతరమైన పోరుకు సిద్ధమైంది అని చెప్పాలి. ఇక వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన ఆర్సిబి టీం ఇక మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తూ ఉంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుజట్టు కెప్టెన్గా వ్యవహరించిన వారు డేంజర్ జోన్ లో ఉన్నారా అంటే మాత్రం అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెంగుళూరు జట్టు రెండుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఒకసారి డూప్లెసెస్ కెప్టెన్ గా ఉన్న సమయంలో స్లో ఓవర్ రేట్ నమోదు అయితే..  కోహ్లీ కెప్టెన్సీలో కూడా దారుణమైన స్లో ఓవర్ రేట్ నమోదయింది.



 దీంతో విరాట్ కోహ్లీకి 24 లక్షల జరిమానా పడింది. ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో కోతపడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ నిబంధనలో ప్రకారం మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదయింది అంటే చాలు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. అయితే ఒకవేళ డూప్లెసెస్ తర్వాత మ్యాచ్ కి కెప్టెన్గా వ్యవహరిస్తే.. ఈ నిబంధన అతనికి కూడా వర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఇలా బెంగుళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్సీ వహించిన.. లేదా డూప్లెసిస్ సారధిగా వ్యవహరించిన స్లో ఓవర్ రేట్ నమోదు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

మహేష్-రాజమౌళి మూవీలో ఊహించని ట్విస్ట్..!?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>