MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthik-dandud23ded9d-6379-4d32-832f-85945674d2c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthik-dandud23ded9d-6379-4d32-832f-85945674d2c0-415x250-IndiaHerald.jpgసాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష' చిత్రం ఎంత పెద్ద సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. తాజాగా 50 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఈ సినిమాకి సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే, కార్తీక్ దండు స్టోరీ, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ మెయిన్ హైలెట్ గా నిలిచాయి.అసలు సినిమాలో దెయ్యం లేకుండానే హారర్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాడు దర్శకుడు కార్తీక్. ఈ సినిమా చూసి ఆడియన్స్ సైతం షాక్ అయ్యKarthik Dandu{#}Genre;Chitram;Audience;Gujarat - Gandhinagar;sai dharam tej;Comedy;sukumar;Darsakudu;Karthik;Success;Cinema;Director'విరూపాక్ష' కథ రాయడనికి కారణం ఆ సంఘటనే : కార్తిక్ దండు'విరూపాక్ష' కథ రాయడనికి కారణం ఆ సంఘటనే : కార్తిక్ దండుKarthik Dandu{#}Genre;Chitram;Audience;Gujarat - Gandhinagar;sai dharam tej;Comedy;sukumar;Darsakudu;Karthik;Success;Cinema;DirectorWed, 26 Apr 2023 15:40:05 GMTసాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష' చిత్రం ఎంత పెద్ద సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. తాజాగా 50 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఈ సినిమాకి సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే, కార్తీక్ దండు స్టోరీ, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ మెయిన్ హైలెట్ గా నిలిచాయి.అసలు సినిమాలో దెయ్యం లేకుండానే హారర్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాడు దర్శకుడు కార్తీక్. ఈ సినిమా చూసి ఆడియన్స్ సైతం షాక్ అయ్యారు. సినిమాలో ఎటువంటి దెయ్యం లేకున్నా హారర్ సినిమాని ఈ దర్శకుడు ఎలా తీయగలిగాడు? అని చాలామంది ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. 

అయితే ఇదే ప్రశ్నకు తాజాగా దర్శకుడు కార్తీక్ స్వయంగా సమాధానం చెప్పాడు. విరూపాక్ష సక్సెస్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ మాట్లాడుతూ..' సినిమాలో దయ్యం ఉండదు. అలా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఈ జోనర్ కి చిన్నప్పటి నుంచి పెద్ద అభిమానిని. ఈ జోనర్లో ఈ మధ్యకాలంలో హారర్ కామెడీ సినిమాలు మాత్రమే వస్తున్నాయి. స్ట్రిక్ట్ హారర్ మూవీస్ రావడం లేదని అనిపించింది. అందుకే అలాంటి సినిమా తీద్దామని అనిపించి విరూపాక్ష తీసా. 2016, 17 లో ఓ పేపర్లో ఆర్టికల్ చదివా.. గుజరాత్ లో ఓ మహిళ చేతబడి చేస్తుందనే అనుమానంతో ఓ చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఒక కథ రాద్దామని.

నిజంగా ఆమెకు చేతబడి వచ్చి ఉంటే వారందరూ చచ్చిపోయేవారేమోనని అనిపించింది. అలా విరూపాక్ష సినిమాకు ఆ ఘటన స్ఫూర్తిగా నిలిచిందంటూ' చెప్పుకువచ్చాడు కార్తీక్ దండు. ఇక ఈ సినిమాకు కథ రాసింది తనే అయినప్పటికీ సుకుమార్తో స్క్రీన్ ప్లే ని రాయించాడు. ఆయనతో దాదాపు 6 నుంచి 7 వెర్షన్ లను రాయించాడట. చివరికి వాటిలో నుంచి బెస్ట్ వెర్షన్ ఫైనల్ చేశాడు. అదే విరూపాక్ష మూవీ. ఇక సుకుమార్ గారు ఇచ్చిన సలహాలు విరూపాక్ష క్లైమాక్స్ కు ఎంతో బాగా హెల్ప్ అయ్యాయని చెప్పుకొచ్చాడు కార్తీక్. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకి ఒప్పుకోవడానికి రీజన్ కూడా సుకుమార్ గారే అని పేర్కొన్నాడు. దీంతో తాజా ఇంటర్వ్యూలో కార్తీక్ దండు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి...!!



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: అయ్యగారు ఆ టార్గెట్ కొడతారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>