MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-and-anushka37d4c57e-d478-47d4-bb90-5113292467d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-and-anushka37d4c57e-d478-47d4-bb90-5113292467d8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ - అనుష్క జంటకు సంబంధించి ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు ఈ జంట కి భారీ క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాల సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. వీళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ జంట కలిసి మరో సినిమా చేస్తే చూడాలని ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంటను మళ్ళీ తెరపై చూసే సమయం మరింPrabhas and Anushka{#}prasad devineni;Manam;UV Creations;silver screen;naveen polishetty;anoushka;Good Newwz;prema;Good news;Pawan Kalyan;Industry;marriage;Love;Audience;Darsakudu;Bahubali;Prabhas;Cinema;Director;Newsలాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ - అనుష్క కాంబోలో సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ - అనుష్క కాంబోలో సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?Prabhas and Anushka{#}prasad devineni;Manam;UV Creations;silver screen;naveen polishetty;anoushka;Good Newwz;prema;Good news;Pawan Kalyan;Industry;marriage;Love;Audience;Darsakudu;Bahubali;Prabhas;Cinema;Director;NewsWed, 26 Apr 2023 17:21:15 GMTప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ - అనుష్క జంటకు సంబంధించి ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు ఈ జంట కి భారీ క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాల సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. వీళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ జంట కలిసి మరో సినిమా చేస్తే చూడాలని ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంటను మళ్ళీ తెరపై చూసే సమయం మరింత దూరంలో లేదని ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ బలంగా వినిపిస్తోంది. 

అనుష్క, ప్రభాస్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నారట. తాజాగా అనుకున్న సమాచారం ప్రకారం దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి ఓ అగ్ర దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతానికి ఆ దర్శకుడు వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నా.. ప్రభాస్డైరెక్టర్ ని నమ్మి అవకాశం ఇచ్చాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా డైరెక్టర్ చేస్తున్న క్రిష్ జాగర్లమూడి. ఈ దర్శకుడు ప్రభాస్, అనుష్క కాంబో కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అనుష్క హీరోయిన్ గా సినిమాలు బాగా తగ్గించేసింది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది.

ప్రస్తుతానికి యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటించేందుకు అనుష్క కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్న క్రిష్ ప్రభాస్ కోసం ఒక స్టోరీని రెడీ చేశాడట. ఇటీవల బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రసాద్ లకు ఆ స్టోరీని వినిపించగా.. వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మళ్లీ ప్రభాస్, అనుష్క జంటను త్వరలోనే మనం తెరపై చూడబోతున్నాం. ఒక విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి...!!



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: అయ్యగారు ఆ టార్గెట్ కొడతారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>