Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam-c07b2f8d-0ad8-4cf6-a74a-c2f1bf471dc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam-c07b2f8d-0ad8-4cf6-a74a-c2f1bf471dc8-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో ఎక్కడ చూసినా బలగం సినిమాకు సంబంధించిన నటులే కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి నటించగా.. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. ఇకపBalagam {#}kalyan ram;priyadarshi;Dil;Venu Thottempudi;Comedian;Smart phone;Girl;marriage;media;Heroine;Hero;Cinema;Directorనీ మొహానికి నువ్వు హీరోయినా అన్నారు : సౌదామినినీ మొహానికి నువ్వు హీరోయినా అన్నారు : సౌదామినిBalagam {#}kalyan ram;priyadarshi;Dil;Venu Thottempudi;Comedian;Smart phone;Girl;marriage;media;Heroine;Hero;Cinema;DirectorWed, 26 Apr 2023 08:29:00 GMTజబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో ఎక్కడ చూసినా బలగం సినిమాకు సంబంధించిన నటులే కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి నటించగా.. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది.


 ఇకపోతే ఈ సినిమాలో హీరో ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పాత్రలో సౌదామిని అనే నటి కనిపిస్తూ ఉంటుంది. హీరో తాత చనిపోయినప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి వస్తుంది. చావు ఇంట్లో ఆమెకు ప్రియదర్శి మర్యాదలు చేసే సీన్ అయితే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఆ తర్వాత ప్రియదర్శి, సౌదామిని ఇద్దరి మీద వచ్చే ఒక సాంగ్ అయితే మరింతగా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌదామిని ఆసక్తికర విషయాలను పంచుకుంది.



 నేను బలగం సినిమాలో ఛాన్స్ కోసం మా అన్నయ్యని తీసుకొని వేణు ఆఫీస్ కి వెళ్ళాను. అయితే ఆయన నన్ను సిగ్గుపడుతూ నటించి చూపించమన్నారు. ఇక ఆయన చెప్పినట్లుగానే నేను నటించాను.. నా నటన నచ్చి ఆయన ఓకే చేశారు. డైరెక్టర్ వళ్ళనే నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఫోన్ చేసి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు అంటూ సౌదామని చెప్పుకొచ్చింది. నీ ఫేస్ కి నువ్వు హీరోయిన్ అవుతావా అని ఎంతోమంది దారుణంగా కామెంట్ చేశారని.. కానీ నేనేం అవేమీ పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది సౌదామిని. మరి సౌదామని ఫ్యూచర్లో సినిమాల్లో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

ఆంటోనీ టీజర్ వచ్చేది అప్పుడే.. విశాల్ ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>