MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun19638bd2-729d-4a45-9940-52b935b306e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun19638bd2-729d-4a45-9940-52b935b306e2-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ అల్లు అర్జున్ ల మధ్య కనిపించని గ్యాప్ ఉంది అంటూ సోషల్ మీడియాలో అనేకసార్లు అనేక కథనాలు వచ్చాయి. దీనికి బలం చేకూర్చే విధంగా బన్నీ ప్రవర్తన తీరు కూడ ఉంటుంది. ఆమధ్య చరణ్ జూనియర్ లు నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినప్పటికీ దానిపై స్పందించలేదు.కనీసం చరణ్ పుట్టినరోజునాడు కూడ బన్నీ తన అభినందనలు తెలియచేయలేదు. దీనితో చరణ్ బన్నీల మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది అంటూ అనేక ఊహాగానాలు పుట్టాయి. అదేవిధంగా చరణ్ ను గ్లోబల్ స్టార్ అని పిలవడానికి బన్నీకి ఆసక్తిలేదు అంటూ కొalluarjun{#}Chiranjeevi;Cheque;Upasana;kalyan;Wife;Jr NTR;Allu Arjunఅల్లు అర్జున్ వ్యవహారశైలికి షాక్ అవుతున్న మెగా అభిమానులు !అల్లు అర్జున్ వ్యవహారశైలికి షాక్ అవుతున్న మెగా అభిమానులు !alluarjun{#}Chiranjeevi;Cheque;Upasana;kalyan;Wife;Jr NTR;Allu ArjunWed, 26 Apr 2023 08:02:02 GMTరామ్ చరణ్ అల్లు అర్జున్ ల మధ్య కనిపించని గ్యాప్ ఉంది అంటూ సోషల్ మీడియాలో అనేకసార్లు అనేక కథనాలు వచ్చాయి. దీనికి బలం చేకూర్చే విధంగా బన్నీ ప్రవర్తన తీరు కూడ ఉంటుంది. ఆమధ్య చరణ్ జూనియర్ లు నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినప్పటికీ దానిపై స్పందించలేదు.


కనీసం చరణ్ పుట్టినరోజునాడు కూడ బన్నీ తన అభినందనలు తెలియచేయలేదు. దీనితో చరణ్ బన్నీల మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది అంటూ అనేక ఊహాగానాలు పుట్టాయి. అదేవిధంగా చరణ్ ను గ్లోబల్ స్టార్ అని పిలవడానికి బన్నీకి ఆసక్తిలేదు అంటూ కొందరు ఊహాగానాలు చేసారు. అయితే ఈ గాసిప్పులకు చెక్ పెడుతూ బన్నీ తన భార్య పిల్లలతో కలిసి ఉపాసన శ్రీమంతం వేడుకలకు వెళ్ళడమే కాకుండా అక్కడ పెద్ద ఎత్తున హడావిడి చేయడమే కాకుండా బన్నీ ఉపాసన ను దీవిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవ్వడం చూసి మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.


గతంలో ఇదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ చెప్పిన బన్నీ ఆతరువాత ఒక ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ను ప్రేమతో కౌగలించు కున్న ఫోటోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. చిరంజీవి అభిమానిగా తన కట్టే కాలేంతవరకు తాను కొనసాగుతాను అని చెప్పే బన్నీ చిరంజీవి పుట్టినరోజునాడు కూడ ఓపెన్ గా అభినందనలు తెలియచేసిన సందర్భాలు చాల తక్కువ.



తన అభిమానులను ‘అల్లు ఆర్మీ’ అంటూ ప్రత్యేకంగా ఒక ట్యాగ్ ను క్రియేట్ చేసిన బన్నీ తమ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ చిరంజీవి చేత చేసిన విషయం తెలిసిందే. ఇలా రకరకాల సందర్భాలలో ఒకవైపు మెగా ఫ్యామిలీతో దూరంగా ఉంటూ మరొకవైపు సన్నిహితంగా ఉంటున్నట్లు వ్యవహరిస్తున్న బన్నీ తీరు మెగా అభిమానులకు షాక్ ను కలిగిస్తోంది..







RRR Telugu Movie Review Rating

ఆంటోనీ టీజర్ వచ్చేది అప్పుడే.. విశాల్ ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>