MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth9e78e898-a3f0-46f2-a84c-6854a5b25234-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth9e78e898-a3f0-46f2-a84c-6854a5b25234-415x250-IndiaHerald.jpgసౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 పదుల వయసు దాటుతున్నా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. అటు దర్శక నిర్మాతలు సైతం ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం ఏకకాలంలో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి 'జైలర్' చిత్రం. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా.. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రెండవ చిత్రం ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న 'లాల్ సలాం'. ఈ మRajinikanth{#}lyca productions;Komaram Bheem;Lokesh;Dilip Kumar;Rajani kanth;Lokesh Kanagaraj;KGF;Yevaru;Kollywood;producer;Producer;Chitram;aishwarya;Director;Cinemaలేడి డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా..?లేడి డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా..?Rajinikanth{#}lyca productions;Komaram Bheem;Lokesh;Dilip Kumar;Rajani kanth;Lokesh Kanagaraj;KGF;Yevaru;Kollywood;producer;Producer;Chitram;aishwarya;Director;CinemaTue, 25 Apr 2023 16:51:41 GMTసౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 పదుల వయసు దాటుతున్నా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. అటు దర్శక నిర్మాతలు సైతం ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం ఏకకాలంలో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి 'జైలర్' చిత్రం. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా.. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రెండవ చిత్రం ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న 'లాల్ సలాం'. ఈ మూవీలో రజినీకాంత్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను రజినీకాంత్ పూర్తి చేశారు.తన తదుపరిచిత్రాన్ని జై భీమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. 

ఇది రజనీకాంత్ కెరియర్ లో 170 సినిమా కావడం విశేషం. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా దీని తర్వాత రజనీకాంత్ నటించబోయే 171వ చిత్రానికి ఇప్పటినుంచి భారీ పోటీ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు దర్శకులతో పాటు కొంతమంది నిర్మంతలు క్యూలో ఉన్నారు. నిజానికి రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో మూవీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం ఒకటి వెలుగులోకి వచ్చింది.

కోలీవుడ్లో ఇరుదు చుట్రు, సూరరైపోట్రూ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర కూడా ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే ఈ డైరెక్టర్ రజినీకాంత్ కథను కూడా వినిపించిందని అంటున్నారు. ఈ కథ కూడా రజనీకాంత్ కి బాగా నచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ని కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు హోంబలే ఫిలిం సంస్థ నిర్మించబోతోందట. ప్రస్తుతం బెంగళూరులోని ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్ ను దర్శకురాలు సుధా కొంగర, హోం బలే నిర్మాత కలసి కథను వినిపించారని.. ఆయన కూడా ఓకే చెప్పారని త్వరలోనే ఈ ప్రాజెక్టు ఉండబోతుందని కోలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది...!!



RRR Telugu Movie Review Rating

హనీ రోజ్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా...?

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>