MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bahubali28b720c4-a524-4b96-8d17-2c90369b53f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bahubali28b720c4-a524-4b96-8d17-2c90369b53f5-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో 'బాహుబలి' సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ ఒకెత్తు అయితే.. బాహుబలి సినిమా మరో ఎత్తు. ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రతి పాత్ర ఆడియన్స్ కి ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అలా అందులో చెప్పుకోవాల్సిన పాత్రలో అనుష్క పోషించిన దేవసేన పాత్ర కూడా ఒకటి. బాహుబలిలో అందాల మహారాణిగా అదే సమయంలో ముసలి తలBahubali{#}anoushka;tara;Arundhati;Bahubali;Mister;aishwarya;Rajamouli;Darsakudu;bollywood;Hero;Audience;Director;Heroine;Cinemaబాహుబలిలో అనుష్క పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?బాహుబలిలో అనుష్క పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?Bahubali{#}anoushka;tara;Arundhati;Bahubali;Mister;aishwarya;Rajamouli;Darsakudu;bollywood;Hero;Audience;Director;Heroine;CinemaTue, 25 Apr 2023 16:08:31 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో 'బాహుబలి' సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ ఒకెత్తు అయితే.. బాహుబలి సినిమా మరో ఎత్తు. ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రతి పాత్ర ఆడియన్స్ కి ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అలా అందులో చెప్పుకోవాల్సిన పాత్రలో అనుష్క పోషించిన దేవసేన పాత్ర కూడా ఒకటి. బాహుబలిలో అందాల మహారాణిగా అదే సమయంలో ముసలి తల్లిగా నటించి మెప్పించింది అనుష్క. అయితే దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ముందుగా వేరే హీరోయిన్ కి ఇవ్వాలని అనుకున్నాడట.

అయితే ఆ హీరోయిన్ ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర కాస్త అనుష్కను వరించింది. ఇంతకీ బాహుబలి లో దేవసేన పాత్రను రిజెక్ట్ చేసింది మరెవరో కాదు.. అందాల తార బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్. బాలీవుడ్ లో బాహుబలి సినిమాని ప్రమోట్ చేయాలంటే ఐశ్వర్య రాయి లాంటి హీరోయిన్ అవసరమని రాజమౌళి ముందుగా భావించాడట. పైగా యువరాణి అంటే అంతే అందంగా ఉండాలని ఐశ్వర్యరాయ్ ని సంప్రదించాడు. కానీ ఐశ్వర్యరాయ్ మాత్రం అప్పటికే తన కూతురు బాగోగులు చూసుకుంటూ ఇంటి వద్ద ఉంటుంది. ఆ కారణంగానే బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో ఆ పాత్ర కోసం రాజమౌళి అనుష్కను తీసుకున్నాడు.

ఐశ్వర్య రాయ్ తర్వాత అనుష్క అయితేనే యువరాణి పాత్రకు న్యాయం చేస్తుందని రాజమౌళి ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ఇక జక్కన్న అనుకున్నట్టుగానే అనుష్క దేవసేన పాత్రకు ప్రాణం పోసింది. అందుకే ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో దేవసేనగా నిలిచిపోయింది అనుష్క. అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్ర తర్వాత అనుష్కకు బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర ఏదైనా ఉందంటే అది బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అనుష్క యువి క్రియేషన్స్ బ్యానర్లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు...!!



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>