Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-be4fcd16-79fa-45ff-be0f-cb68ffb9124c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-be4fcd16-79fa-45ff-be0f-cb68ffb9124c-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్-ఉపాసనలకు పుట్టబోయేది అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. అందుకు ఇవే ప్రూఫ్స్, వారిద్దరూ పరోక్షంగా చెప్పేశారనే వాదన మొదలైంది. మెగా వారసుడు కోసం పదేళ్లుగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలకు మించి సినిమా వారసత్వాన్ని ఫ్యాన్స్ కోరుకుంటారు. దశాబ్దాలుగా ఈ ట్రెండు కొనసాగుతుంది. అది తమ పరువుకు సంబంధించిన విషయంగా భావిస్తారు. ఈ క్రమంలో ఏళ్లుగా రామ్ చరణ్, ఉపాసన ఈ విషయంలో ఒత్తిడి ఎSocialstars lifestyle {#}December;Gift;Upasana;Pink;June;Chiranjeevi;ram pothineni;Girl;Allu Arjun;Ram Charan Teja;Varasudu;media;Heart;Yevaru;News;Cinemaఅమెరికాలో ఆంక్షలు లేవు కనుక అలా చేసిన రామ్ చరణ్ దంపతులు.....!!అమెరికాలో ఆంక్షలు లేవు కనుక అలా చేసిన రామ్ చరణ్ దంపతులు.....!!Socialstars lifestyle {#}December;Gift;Upasana;Pink;June;Chiranjeevi;ram pothineni;Girl;Allu Arjun;Ram Charan Teja;Varasudu;media;Heart;Yevaru;News;CinemaTue, 25 Apr 2023 11:31:01 GMTరామ్ చరణ్-ఉపాసనలకు పుట్టబోయేది అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. అందుకు ఇవే ప్రూఫ్స్, వారిద్దరూ పరోక్షంగా చెప్పేశారనే వాదన మొదలైంది.

మెగా వారసుడు కోసం పదేళ్లుగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలకు మించి సినిమా వారసత్వాన్ని ఫ్యాన్స్ కోరుకుంటారు. దశాబ్దాలుగా ఈ ట్రెండు కొనసాగుతుంది. అది తమ పరువుకు సంబంధించిన విషయంగా భావిస్తారు. ఈ క్రమంలో ఏళ్లుగా రామ్ చరణ్, ఉపాసన ఈ విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

 
తాము పిల్లలను కనకపోవడానికి కారణం ఉందని ఉపాసన నేరుగా వెల్లడించారు. పెళ్ళైన వెంటనే ఈ మేరకు ఉపాసన దంపతుల మధ్య అగ్రిమెంట్ ఉందట. పదేళ్ల తర్వాతే ఫ్యామిలీ ప్లానింగ్ అని ఒక నిర్ణయానికి వచ్చారట. సమాజం నుండి, కుటుంబ సభ్యుల నుండి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా అగ్రిమెంట్ బ్రేక్ చేయలేదని ఉపాసన చెప్పుకొచ్చారు. గత ఏడాది డిసెంబర్ 12న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఉపాసన-రామ్ చరణ్ పేరెంట్స్ కాబోతున్నారంటూ ప్రకటించారు.

 
చిరంజీవి ప్రకటన చిరంజీవి అభిమానులను ఎక్కడలేని సంతోషంలో ముంచింది. వారు సంబరాలు జరుపుకున్నారు. కాగా వారు రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే వారి ఆశలు గల్లంతే అంటున్నారు. ఉపాసనకు పుట్టేది అమ్మాయే అని ఓ చర్చ మొదలైంది. అందుకు ఆధారాలు చూపుతూ కొందరు బల్లగుద్ది చెబుతున్నారు.

 
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ మొదటి ఆధారంగా చెబుతున్నారు. పరోక్షంగా వారు తమ మాటల్లో పుట్టబోయేది అమ్మాయే అని హింట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. రామ్ చరణ్ మాట్లుడుతూ... థర్డ్ జూన్ ఆన్ 'హెర్' వే... అన్నారు. జూన్ నెలలో అమ్మాయి రాబోతుందని ఆయన ఫ్లోలో అనేశారు. కాబట్టి ఇదొక ఆధారంగా అనుకోవచ్చు.

 
ఇటీవల జరిగిన ఉపాసన సీమంత వేడుకలో పింక్ కలర్ హైలెట్ చేశారు. పింక్ థీమ్ లో సీమంత వేడుకను అలంకరించారు. ఉపాసన సైతం మిల్కీ పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించారు. పింక్ కలర్ అమ్మాయికి సూచన అని, పుట్టబోయేది అమ్మాయని తెలిసిన రామ్ చరణ్-ఉపాసన అలా సీమంత వేడుక అలకరించారని అంటున్నారు.
ఇక మూడో హింట్ గా అల్లు అర్జున్ గిఫ్ట్ ని ప్రస్తావిస్తున్నారు. ఉపాసన సీమంత వేడుకకు హాజరైన అల్లు అర్జున్ ఉపాసనతో కలిసి ఫోటో దిగారు. సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సి... అని కామెంట్ పెట్టారు. అలాగే గిఫ్ట్ వ్రాప్ తో కూడిన పింక్ కలర్ హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాసనకు పుట్టబోయేది ఖచ్చితంగా అమ్మాయే అంటున్నారు.
అయితే ఉపాసన-రామ్ చరణ్ లకు పుట్టబోయేది అమ్మాయే అని ఎలా తెలుసు? లింగనిర్ధారణకు పాల్పడ్డారా, అది నేరం కదా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ లో లింగనిర్ధారణ మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి రామ్ చరణ్ దంపతులు యూఎస్ లో తమకు పుట్టబోయే బిడ్డ ఎవరనే సమాచారం పొంది ఉండవచ్చని ఒక వాదన. ఏది ఏమైనా ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఉపాసనకు పుట్టేది అమ్మాయా? అబ్బాయా? అనేది తెలియాలంటే మరో మూడు నెలలు వేచి చూడాల్సిందే.

 
రామ్ చరణ్ సిస్టర్ సుస్మిత ఆ మధ్య అబ్బాయి పుడితే బాగుండు అన్నారు. ఇప్పటికే మా ఫ్యామిలీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరు పుట్టినా ఓకే, అబ్బాయి పుడితే సో హ్యాపీ అన్నారు. చిరంజీవి ఇద్దరు కుమార్తలకు అమ్మాయిలే అని సమాచారం. అందుకే అబ్బాయి పుడితే ఆ లోటు తీరుతుందని ఆమె అన్నారు.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>