MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha053a9e54-e84e-4bb5-adc9-a8743971e86a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha053a9e54-e84e-4bb5-adc9-a8743971e86a-415x250-IndiaHerald.jpgమెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన 'విరూపాక్ష' సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మిస్టిక్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమాలోని హార్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సినిమా చూస్తున్నంతసేపు ఎంతో ఉత్కంఠానికి గురిచేశాయి. ఇక ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడని మెగా అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు తొలిరోజునే మంచిVIRUPAKSHA{#}prasad;sukumar;Tamil;Blockbuster hit;Music;sai dharam tej;Director;Thriller;Darsakudu;Santosham;Cinema;Audience;HeroUSA లో ఆ రికార్డ్ కొట్టబోతున్న విరూపాక్ష?USA లో ఆ రికార్డ్ కొట్టబోతున్న విరూపాక్ష?VIRUPAKSHA{#}prasad;sukumar;Tamil;Blockbuster hit;Music;sai dharam tej;Director;Thriller;Darsakudu;Santosham;Cinema;Audience;HeroTue, 25 Apr 2023 19:10:00 GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన 'విరూపాక్ష' సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మిస్టిక్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమాలోని హార్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సినిమా చూస్తున్నంతసేపు ఎంతో ఉత్కంఠానికి గురిచేశాయి. ఇక ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడని మెగా అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు తొలిరోజునే మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం సినిమా వసూళ్లపై చాలా బలంగా పడింది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఈ సినిమా రూ.12 కోట్ల   వసూళ్లు సాధించడం జరిగింది..మొదటి వీకెండ్ ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.50 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా బాగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఇప్పటి దాకా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 850K డాలర్ల పైగా వసూళ్లు సాధించినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు.


సినిమా జోరు అక్కడ కూడా బాగా కంటిన్యూ అవుతుండటంతో ఈ వారంలో మిలియన్ డాలర్ క్లబ్‌లో విరూపాక్ష చేరడం ఖచ్చితంగా ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో పాటు సంయుక్తా మీనన్‌ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అలాగే కాంతార సినిమాకి సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ సంగీతం కూడా ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది. ఇక సుకుమార్ రైటింగ్స్, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి భారీ వసూళ్లు రాబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాకి పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాని మేకర్స్ హిందీ, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చెయ్యడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు. చూడాలి అక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో..



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>