MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulice6242f6-460d-46be-bd81-d9dc03feadf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulice6242f6-460d-46be-bd81-d9dc03feadf0-415x250-IndiaHerald.jpgమణిరత్నం పేరు తెలియనివారు ఉండరు. ఆయన తీసిన ‘నాయకుడు’ ‘గీతాంజలి’ ‘ఘర్షణ’ ‘దళపతి’ ‘రోజా’ ‘బొంబాయి’ లాంటి సినిమాలు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించడమే కాకుండా కలక్షన్స్ సునామి సృష్టించిన విషయం ఒక చరిత్ర. అయితే అలాంటి మణిరత్నం ప్రస్తుత తరం ప్రేక్షకులు మెచ్చే సినిమాలను తీయలేకపోతున్నాడు అన్న విమర్శలు కొన్ని వర్గాలలో ఉన్నాయి. ఈ దర్శకుడు తన పట్టు నిలుపుకోవడానికి ‘కడలి’ ‘చెలియా’ ‘నవాబ్’ ‘ఓకె బంగారం’ లాంటి సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలకు ప్రశంసలు దక్కాయి కానీ మణిరత్నం కోరుకున్న బ్లాక్ బష్టర్ హిట్ ను అందివrajamouli{#}history;Darsakudu;India;Event;Audience;Mani Ratnam;akhil akkineni;Tollywood;Rajamouli;Industry;Telugu;Directorరాజమౌళిని టార్గెట్ చేసిన మణిరత్నం !రాజమౌళిని టార్గెట్ చేసిన మణిరత్నం !rajamouli{#}history;Darsakudu;India;Event;Audience;Mani Ratnam;akhil akkineni;Tollywood;Rajamouli;Industry;Telugu;DirectorTue, 25 Apr 2023 13:46:41 GMTమణిరత్నం పేరు తెలియనివారు ఉండరు. ఆయన తీసిన ‘నాయకుడు’ ‘గీతాంజలి’ ‘ఘర్షణ’ ‘దళపతి’ ‘రోజా’ ‘బొంబాయి’ లాంటి సినిమాలు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించడమే కాకుండా కలక్షన్స్ సునామి సృష్టించిన విషయం ఒక చరిత్ర. అయితే అలాంటి మణిరత్నం ప్రస్తుత తరం ప్రేక్షకులు మెచ్చే సినిమాలను తీయలేకపోతున్నాడు అన్న విమర్శలు కొన్ని వర్గాలలో ఉన్నాయి.  


ఈ దర్శకుడు తన పట్టు నిలుపుకోవడానికి ‘కడలి’ ‘చెలియా’ ‘నవాబ్’ ‘ఓకె బంగారం’ లాంటి సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలకు ప్రశంసలు దక్కాయి కానీ మణిరత్నం కోరుకున్న బ్లాక్ బష్టర్ హిట్ ను అందివ్వలేకపోయాయి. అయినప్పటికీ తాను భారీ సినిమాలను తీయగలను అని అందరికీ తెలిసేలా భారీ బడ్జెట్ తో తీసిన ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ వన్ కు తమిళనాడులో విపరీతమైన కలక్షన్స్ వచ్చినప్పటికీ మిగతా భాషలలో ఆమూవీ ఊహించిన స్థాయిలో విజయవంతం కాలేదు.


అయినప్పటికీ మణిరత్నం తన అభిలాషను ఏమాత్రం తగ్గించుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 ను నిర్మించడమే కాకుండా ఈమూవీని పాన్ ఇండియా మూవీగా ఈవారం విడుదల చేస్తున్నారు. ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. రాజమౌళి ‘బాహుబలి’ తీయకుండా ఉంటే తాను ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి భారీ సినిమాను తీసి ఉండేవాడిని కానని తనకు ఒక విధంగా స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి రాజమౌళి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఆయన సహృదయతకు నిదర్శనం అంటూ ఇండస్ట్రీ వర్గాలు మణిరత్నం పై ప్రశంసలు కురిపిస్తున్నాయి.


ఈమూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్నప్పటికీ ఈమూవీతో అఖిల్ ‘ఏజెంట్’ పోటీ పడుతూ ఒక సంచలనంగా మారింది. ఈమూవీకి ఇప్పటికే తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఏర్పడినప్పటికీ ఈమూవీకి తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి క్రేజ్ ఏర్పడక పోవడంతో ఈ సీక్వెల్ విజయం కూడ కేవలం తమిళనాడుకే పరిమితం అవుతుందా అన్న సందేహాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలకు ఏర్పడుతున్నాయి..  






RRR Telugu Movie Review Rating

4వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>