PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-supreme-courtdc8e65b5-5679-439b-8d07-eea3fe0f6085-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-supreme-courtdc8e65b5-5679-439b-8d07-eea3fe0f6085-415x250-IndiaHerald.jpgకొత్త దర్యాప్తు బృందానికి సరైన సమయం ఇచ్చుంటే అన్నీ కోణాల్లోను విచారణ జరిపేందుకు అవకాశముండేది. కానీ సుప్రింకోర్టు అలా ఇవ్వకపోవటంతోనే గడువులోగా దర్యాప్తు ముగించి హత్యకు కారణంఏమిటో తేల్చేయాలని ఆతృతపడింది. ఈ ఆతృతలో భాగంగానే గతంలో దర్యాప్తుచేసిన రామ్ సింగ్ రిపోర్టునే ఫాలోయ్యింది. సరే పాత విషయాలు ఎలాగున్నా గడువు రెండునెలలపాటు పెరిగిన కారణంగా కొత్త బృందమైనా సరైన కోణంలో దర్యాప్తు చేస్తుందేమో చూడాలి. viveka supreme court jagan {#}devineni avinash;kadapa;High court;court;CBI;Murder;Murder.;June;ram pothineniఢిలీ : వివేకా హత్య కేసు..మారిన డెడ్ లైన్ఢిలీ : వివేకా హత్య కేసు..మారిన డెడ్ లైన్viveka supreme court jagan {#}devineni avinash;kadapa;High court;court;CBI;Murder;Murder.;June;ram pothineniTue, 25 Apr 2023 07:00:00 GMT


వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణ గడువును సుప్రింకోర్టు పొడిగించింది. మామూలుగా అయితే ఈనెల 30వ తేదీకల్లా హత్య కేసు దర్యాప్తును ముగించి కోర్టులో రిపోర్టు చేయాలి. అయితే తాజా పరిణామాల కారణంగా దర్యాప్తు గడువును జూన్ 30వ తేదీవరకు పొడిగించింది. అంటే అదనంగా మరో రెండు నెలలు సమయాన్ని పొడిగించింది. దర్యాప్తు గడువు దగ్గరపడుతున్న కొద్దీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త ఆరోపణలు, కొత్త స్టేట్మెంట్లు ఇస్తున్నారు.





అందుకనే దర్యాప్తు గడువును పొడిగించాలని సీబీఐ విజ్ఞప్తి ప్రకారం రెండునెలలు గడువును సుప్రింకోర్టు పొడిగించింది. నిజానికి నాలుగేళ్ళు దర్యాప్తు జరుగుతున్నా కేసు విచారణ ఇంతవరకు ఒక కొలిక్కిరాలేదు. నాలుగేళ్ళ విచారణలో తేలని విషయాలు ఒక్కనెలలో తేలుతాయని కోర్టు ఎలాగ అనుకుందో అర్ధంకావటంలేదు. గడవిచ్చింది నెలరోజులే కాబట్టి సీబీఐ కొత్త బృందం పాత అధికారుల రిపోర్టునే ఫాలో అయిపోయినట్లు అర్ధమవుతోంది. ముందున్న వాళ్ళని ఫాలో అయిపోవటం సులభంకదా. 





కొత్త దర్యాప్తు బృందానికి సరైన సమయం ఇచ్చుంటే అన్నీ కోణాల్లోను విచారణ జరిపేందుకు అవకాశముండేది. కానీ సుప్రింకోర్టు అలా ఇవ్వకపోవటంతోనే గడువులోగా దర్యాప్తు ముగించి హత్యకు కారణంఏమిటో తేల్చేయాలని ఆతృతపడింది. ఈ ఆతృతలో భాగంగానే గతంలో దర్యాప్తుచేసిన రామ్ సింగ్ రిపోర్టునే ఫాలోయ్యింది. సరే పాత విషయాలు ఎలాగున్నా గడువు రెండునెలలపాటు పెరిగిన కారణంగా కొత్త బృందమైనా సరైన కోణంలో దర్యాప్తు చేస్తుందేమో చూడాలి.





ఇక సీబీఐ అనుమానితుల్లో కీలకమైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను సుప్రింకోర్టు రద్దుచేసింది. అలాగే వ్యవహారం మొత్తాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఇదే సమయంలో తొందరగా కేసును తేల్చాలని హైకోర్టును సుప్రింకోర్టు ఆదేశించింది. నాలుగేళ్ళుగా విచారణ జరపని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని సీబీఐ తాజాగా విచారించటం గమనార్హం. మరి సీబీఐ విచారణలో నర్రెడ్డి ఏమిచెప్పారో బయటకు తెలీలేదు. తాజా పరిణామాల్లో హైకోర్టు విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే.




RRR Telugu Movie Review Rating

పెరిగిపోతున్న సుకుమార్ బ్రాండ్ ఇమేజ్ !

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>