Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c80ac166-8230-4145-84e5-90ee116e2e35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c80ac166-8230-4145-84e5-90ee116e2e35-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పూజాకి అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె నటించిన సినిమాలు మాత్రం డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. కాగా పూజ హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ మూడు సినిమాలు గత ఏడాది విడుదల అయ్యే డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పూజ హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇకపోతే ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖSocialstars lifestyle {#}Turmeric;vegetable market;Ghee;John;CBN;Pooja Hegde;Makeup;Jaan;Aqua;Ishtam;Heroine;Tollywood;Hero;Telugu;bollywood;BEAUTY;Cinemaస్నానానికి ముందు ఏం చేస్తాదో చెప్పిన స్టార్ హీరోయిన్...!!స్నానానికి ముందు ఏం చేస్తాదో చెప్పిన స్టార్ హీరోయిన్...!!Socialstars lifestyle {#}Turmeric;vegetable market;Ghee;John;CBN;Pooja Hegde;Makeup;Jaan;Aqua;Ishtam;Heroine;Tollywood;Hero;Telugu;bollywood;BEAUTY;CinemaTue, 25 Apr 2023 12:22:42 GMTటాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పూజాకి అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె నటించిన సినిమాలు మాత్రం డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.

కాగా పూజ హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ మూడు సినిమాలు గత ఏడాది విడుదల అయ్యే డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పూజ హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇకపోతే ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన కిసికా భాయ్ కిసికా జాన్ సినిమాలో నటించగా ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి మిక్స్డ్ డిటాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇకపోతే పూజ హెగ్డే అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ అందానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఈమెకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇకపోతే హీరోయిన్స్అం దం ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మనందరికీ తెలిసిందే. ఇక పూజ హెగ్డే కూడా ఎప్పటికప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తూ యోగాలు చేస్తూ ఫిట్నెస్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.. అలాగే అందం విషయంలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే బ్యూటీ టిప్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది.

అభిమానులు ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. తాజాగా బ్యూటీ సీక్రెట్స్ ని పంచుకుంది పూజ హెగ్డే. హీరోయిన్స్ అంటే మేకప్ తప్పనిసరి. శరీరంపై రసాయనాల ప్రభావం ఉంటుంది కాబట్టి సహజమైన ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. అలాగే పసుపు పాలమీగడ కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా పెట్టుకుంటాను. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటాను. అప్పుడు ముఖం తాజాగా తయారవుతుంది. అలాగే ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకుంటాను. అధికంగా ఉండే కూరగాయలు పాలు పాల పదార్థాలు వంటివి తీసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. అలాగే ఉదయం లేవగానే ముఖాన్ని కడుక్కొని మాశ్చరైజింగ్ చేసుకుంటుందట. నీటి శాతం అధికంగా ఉండే పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటుందట. ఎండలో ట్యాన్ కాకుండా సన్ స్క్రీన్ రాసుకుంటారట. షూటింగ్స్ కి లేకపోతే మేకప్ అసలు వేసుకోదట. ఒకవేళ మేకప్ వేసుకున్నప్పటికీ రాత్రి సమయంలో మేకప్ తీసేసి మాశ్చరైజ్ చేసుకుని పడుకుంటుందట పూజ హెగ్డే. ఇక బయట వాతావరణానికి చర్మం దెబ్బతినకుండా తన బ్యాగ్ లో మాయిశ్చరైజర్, లిప్స్టిక్, గ్లాసెస్, సన్స్క్రీన్ ఉంటాయట. సమయం దొరికితే స్పాకు వెళతారట. డీప్ టిష్యూ మసాజ్ అంటే ఇష్టం అంటూ తన బ్యూటీ సీక్రెట్స్ ని అభిమానులతో పంచుకుంది పూజ హెగ్డే.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>