MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdedd6ac4b5-fa8b-4575-8790-ed9a13a7f981-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdedd6ac4b5-fa8b-4575-8790-ed9a13a7f981-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ అమ్మడు నటించిన గత ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్స్ గా నిలిచాయి. తెలుగు, తమిళ భాషలతో పాటు అటు బాలీవుడ్లో నటించిన రెండు సినిమాలు సైతం పరాజయం పాలయ్యాయి. ఇలా ఈమె నటిస్తున్న వరుస సినిమాలు ప్లాప్ అవడంతో ఈమె పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ ఐదు ప్లాపులు వచ్చిన ఈ హీరోయిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గ లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వరుస ప్లాపులు వస్తున్నా ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయట. ప్రభాస్ తో పూజా హెPooja Hegde{#}Ramzan;Dalapathi;trivikram srinivas;John;mahesh babu;Tollywood;Heroine;Joseph Vijay;Hero;Success;Jaan;Pooja Hegde;bollywood;Salman Khan;Ram Charan Teja;Prabhas;Tamil;Cinemaఐదు ప్లాపులు.. అయినా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..?ఐదు ప్లాపులు.. అయినా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..?Pooja Hegde{#}Ramzan;Dalapathi;trivikram srinivas;John;mahesh babu;Tollywood;Heroine;Joseph Vijay;Hero;Success;Jaan;Pooja Hegde;bollywood;Salman Khan;Ram Charan Teja;Prabhas;Tamil;CinemaTue, 25 Apr 2023 17:49:17 GMTటాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ అమ్మడు నటించిన గత ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్స్ గా నిలిచాయి. తెలుగు, తమిళ భాషలతో పాటు అటు బాలీవుడ్లో నటించిన రెండు సినిమాలు సైతం పరాజయం పాలయ్యాయి. ఇలా ఈమె నటిస్తున్న వరుస సినిమాలు ప్లాప్ అవడంతో ఈమె పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ ఐదు ప్లాపులు వచ్చిన ఈ హీరోయిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గ లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వరుస ప్లాపులు వస్తున్నా ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయట. ప్రభాస్ తో పూజా హెగ్డే నటించిన రాదేశ్యామ్ సినిమా భారీ అంచనా నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది. 

ఆ తర్వాత బాలీవుడ్లో ఇలా దళపతి విజయ్ కి జోడిగా బీస్ట్ అనే సినిమాలో నటించినా.. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో చేసిన సర్కస్, మళ్లీ రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమాలు కూడా డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇక తాజాగా మళ్లీ బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తో కలిసి 'కిసికా భాయ్ కిసికా జాన్'అనే సినిమా చేసింది పూజ హెగ్డే. తాజాగా రంజాన్ కానుకగా విడుదలైన ఈ సినిమా కూడా పూజ హెగ్డే కి భారీ నిరాశనే మిగిలింది. ప్రస్తుతం కిసీక భాయ్ కీసిక జాన్ సినిమా బాలీవుడ్ లో మరో ప్లాప్ గా నిలిచింది. సల్మాన్ ఖాన్ క్రేజ్ వల్లే సినిమాకి కలెక్షన్లు వస్తున్నా.. సినిమాలో అసలు కంటెంట్ లేదు. ఇలా పూజ హెగ్డే కి వరుసగా 5 ప్లాపులు వచ్చిననా సరే తాజాగా ఈ అమ్మడు మరో స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుందట.

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట ఈ బుట్ట బొమ్మ. అయితే హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఇలా వరుస అవకాశాలు అందుకుంటూపోతున్న పూజ హెగ్డే ను చూసి కొంతమంది అభిమానులు షాక్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకటి రెండు ప్లాపులు పడితేనే హీరోయిన్లు అడ్రస్ లేకుండా పోతున్నారు. అలాంటిది పూజ హెగ్డే కి మాత్రం భారీ ప్లాప్స్ వస్తున్నా.. మళ్లీ అవకాశాలను అందుకుంటూ తన ఫామ్ ని అలాగే మైంటైన్ చేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న 'SSMB 28' కనుక హిట్ అయితే ఈ అమ్మడు మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టే. మరి మహేష్ - త్రివిక్రమ్ మూవీ అయినా పూజా హెగ్డే కి సక్సెస్ ని అందిస్తుందేమో చూడాలి...!!



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>