EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinaf7db7b87-281b-4418-b31b-10bb3e0dc3f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinaf7db7b87-281b-4418-b31b-10bb3e0dc3f9-415x250-IndiaHerald.jpgచైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఏమైనా నోబెల్ బహుమతి ట్రై చేస్తున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే చైనా తైవాన్ ను ఆక్రమించుకుని దానిపై పెత్తనం చేయాలని ప్రయత్నిస్తోంది. మరో వైపు భారత్ తో గాల్వాన్ లోయలో గొడవపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ నాది అని నానా యాగి చేస్తుంటుంది. ఇంత చేసి ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పుతాం అని ముందుకు వస్తోంది. కొంచెం విచిత్రంగా అనిపించిన చైనా ప్రస్తుతం చేస్తున్న పని ఇదే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఏళ్ల తరబడి ఉప్పు నిప్పులా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య సఖ్యత కుదర్చడంలో CHINA{#}India;Iran;Ukraine;Israel;nobel award;saltకయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?CHINA{#}India;Iran;Ukraine;Israel;nobel award;saltMon, 24 Apr 2023 06:00:00 GMTచైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఏమైనా నోబెల్ బహుమతి ట్రై చేస్తున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే చైనా తైవాన్ ను ఆక్రమించుకుని దానిపై పెత్తనం చేయాలని ప్రయత్నిస్తోంది. మరో వైపు భారత్ తో గాల్వాన్ లోయలో గొడవపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ నాది అని నానా యాగి చేస్తుంటుంది. ఇంత చేసి ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పుతాం అని ముందుకు వస్తోంది.


కొంచెం విచిత్రంగా అనిపించిన చైనా ప్రస్తుతం చేస్తున్న పని ఇదే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఏళ్ల తరబడి ఉప్పు నిప్పులా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య సఖ్యత కుదర్చడంలో విజయవంతం అయ్యారు. రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చి ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేకుండా సున్నీలు, షియాలు కలిసిపోయేలా చేశారు. దీంతో ఇరాన్, సౌదీ వైపు ఉన్న దేశాలు యెమెన్, లెబనాన్, సిరియా, లాంటి దేశాల్లో కూడా గొడవలు ఆగిపోయాయి.


ఇలా శాంతి మంత్రంతో ఇక్కడ దాడులను ఆపగలిగింది. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపలేకపోతుంది. 12 శాంతి సూత్రాలతో యుద్ధాన్ని ఆపవచ్చని రష్యా, ఉక్రెయిన్ కు సూచించింది. కానీ ఇందులో ఏ షరతుకు కూడా ఇరు దేశాలు ఒప్పుకోలేదు. అలాగే ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉన్న వైరాన్ని తొలగించాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది సాధ్యపడని విషయం.


గాజా పాలస్తీనాకు కావాలి. ఇజ్రాయిల్ కు కావాలి. ఏ దేశం ఆ నగరాన్ని విడిచిపెట్టాలనుకోదు.  ఇలాంటి తరుణంలో ఏం చేయాలనే ఆలోచనతో ఇజ్రాయిల్ దేశంలో 18 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కానీ యుద్ధాన్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయిల్ కు సూచించింది. కానీ ఇజ్రాయిల్ ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది. ఇజ్రాయిల్ తను అనుకున్నది సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదు. జిన్ పింగ్ గానీ నోబెల్ శాంతి బహుమతికి పోటీ పడుతున్నాడా ఏంటి అనేలా ఇలాంటి పనులు చేస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

కోస్తా : టీడీపీకి వైసీపీనే మేలు చేస్తోందా ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>