Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/oil0c6305ba-9d97-4c6b-8e59-eec687082bcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/oil0c6305ba-9d97-4c6b-8e59-eec687082bcb-415x250-IndiaHerald.jpgప్రేమ అనేది ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం అని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి డైలాగులు కేవలం సినిమాలకు మాత్రమే సరిపోతున్నాయి. కానీ నిజజీవితంలో మాత్రం ఇలాంటివి ఎక్కడ కనిపించడం లేదు. అయితే ప్రేమ అంటే మధురానుభూతి ఏమో కానీ.. ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. తమను ప్రేమించాలి అంటూ వెంట పడటం నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ మాయమాటలు చెప్పడం చేస్తున్నారు ఎంతో మంది యువకులు. ఒకవేళ యువతి ప్రేమను నిరాకరించింది అంటే చాలు నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పిన వారే.. చిOil{#}Eluru;mandalam;oil;Yevaru;prema;police;Andhra Pradesh;News;Loveప్రేమను ఒప్పుకోలేదని.. యువతిపై వేడి నూనె పోశాడు.. చివరికి?ప్రేమను ఒప్పుకోలేదని.. యువతిపై వేడి నూనె పోశాడు.. చివరికి?Oil{#}Eluru;mandalam;oil;Yevaru;prema;police;Andhra Pradesh;News;LoveMon, 24 Apr 2023 10:00:00 GMTప్రేమ అనేది ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం అని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి డైలాగులు కేవలం సినిమాలకు మాత్రమే సరిపోతున్నాయి. కానీ నిజజీవితంలో మాత్రం ఇలాంటివి ఎక్కడ కనిపించడం లేదు. అయితే ప్రేమ అంటే మధురానుభూతి ఏమో కానీ.. ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. తమను ప్రేమించాలి అంటూ వెంట పడటం నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ మాయమాటలు చెప్పడం చేస్తున్నారు ఎంతో మంది యువకులు.



 ఒకవేళ యువతి ప్రేమను నిరాకరించింది అంటే చాలు నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పిన వారే.. చివరికి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఇటీవల కాలంలో ప్రేమున్మాదులు  రెచ్చిపోతున్న తీరు ప్రతి ఒక్కరిలో కూడా భయాన్ని కలిగిస్తూ ఉంది. ఏకంగా సినిమాల్లో చూపించినట్లుగా కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రేమోన్మాధులు  రెచ్చిపోయి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా రెచ్చిపోయిన యువకుడు ఒక విద్యార్థినిపై సలసలా కాగుతున్న నూనె పోసాడు.


 పెదవేగి మండలం దుగ్గిరాలలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ యువకుడు బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఆమెపై వేడి నూనె పోసి సైకో లాగా ప్రవర్తించాడు. ఆ దుర్మార్గుడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి చివరికి పేరెంట్స్ కి సమాచారం అందించింది. అయితే తీవ్ర గాయాల పాలైన సదరు యువతీని ఏలూరు ప్రభుత్వాసుపత్రికీ తరలించారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం యువతి షాక్ లో ఉండడంతో పోలీసులు ఆమె దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోలేదు. షాప్ నుంచి తేరుకున్నాక ఇక నిందితుడు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.



RRR Telugu Movie Review Rating

"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>