EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjpf7b512db-5b9d-4f38-83a9-6d32ee8a8776-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjpf7b512db-5b9d-4f38-83a9-6d32ee8a8776-415x250-IndiaHerald.jpgభాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావుకూ.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డికి మధ్య ఇప్పుడు మాటల యుద్ధం సాగుతోంది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఫామ్‌ హౌజ్‌ల పేరుతో భూకబ్జాలకు పాల్పడ్డారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తాజాగా తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. తాను భూ అక్రమాలకు పాల్పడినట్లు చుట్టుపక్కల రైతులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. రఘునందన్ రావు చేసిన ఆరోపణల్BJP{#}Krishna River;Sri Venkateswara swamy;MLA;Nijam;Raghunandan Rao;రాజీనామా;war;Bharatiya Janata Party;Minister;Reddyరఘునందన్‌ VS నిరంజన్‌రెడ్డి.. ప్రమాణాల రాజకీయం?రఘునందన్‌ VS నిరంజన్‌రెడ్డి.. ప్రమాణాల రాజకీయం?BJP{#}Krishna River;Sri Venkateswara swamy;MLA;Nijam;Raghunandan Rao;రాజీనామా;war;Bharatiya Janata Party;Minister;ReddyMon, 24 Apr 2023 08:30:00 GMTభాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావుకూ.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డికి మధ్య ఇప్పుడు మాటల యుద్ధం సాగుతోంది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఫామ్‌ హౌజ్‌ల పేరుతో భూకబ్జాలకు పాల్పడ్డారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తాజాగా తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. తాను భూ అక్రమాలకు పాల్పడినట్లు చుట్టుపక్కల రైతులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.


రఘునందన్ రావు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని...అయన ఎప్పుడూ వచ్చినా గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్దమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మీ ఆరోపణలు దురుద్దేశ పూర్వకం  కాకపోతే వెంటనే స్పందించాలని దుబ్బాక ఎమ్మెల్యేనుద్దేశించి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఒక్క గుంటభూమి అక్రమించిన తన వ్యాఖ్యలను కట్టుబడి ఉంటానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిఅన్నారు.


అసలు ఆర్డీఎస్‌ ఎక్కుడుందో కృష్ణానది ముంపు ఎక్కడుందో అవగాహన లేకుండా రఘునందన్‌ మాట్లాడుతున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి దుయ్యబట్టారు. మానవపాడు తహసీల్దార్ ఆఫీసుల్లో రికార్డులు దగ్దం కావడం ఈ భూములకు లింకుపెట్టడం అత్యంత నీచమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు.


అసలు చండూరులో శాశ్వత నిర్మాణాలు లేవని... కూలీలు, బర్లు, ఆవులు, గొర్లు, ట్రాక్టర్ షెడ్లు మాత్రమే ఉన్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతుల కోరిక మేరకు అక్కడ రోడ్డు వేయించామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 27 తర్వాత నా వ్యవసాయ క్షేత్రాలకు రాష్ట్ర మీడియాలను ఆహ్వానిస్తున్నానని... రఘునందన్ రావు కూడా రావొచ్చునని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.రఘునందన్ క్షమాపణ చెప్పకున్నా తప్పు తెలుసుకుంటే మంచిదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>