EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth3fea57f5-c8c7-4aed-8d4f-249d3d5c6ad7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth3fea57f5-c8c7-4aed-8d4f-249d3d5c6ad7-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సవాళ్ల పర్వం సాగుతోంది. కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, భాజపా నేత ఈటెల రాజేందర్‌ ఇద్దరు దొంగ నాటకాలు ఆడుతున్నారని, వారిందరు ఒక్కటే నని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి తాజాగా విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క రూపాయి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం సాక్షిగా ప్రమాణం చేశారని...ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడని ఆనాడు నేను చెప్పానని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఈటెల రాజేందర్ వ్యాఖ్యల పై స్పందించిన రేవంత్... ఆrevanth{#}revanth;Revanth Reddy;Nijam;Donga;Huzurabad;Thief;Bharatiya Janata Party;Legend;temple;Partyరేవంత్‌కు రూ.25 కోట్లు ఇచ్చిన రేవంత్‌? నిజమెంత?రేవంత్‌కు రూ.25 కోట్లు ఇచ్చిన రేవంత్‌? నిజమెంత?revanth{#}revanth;Revanth Reddy;Nijam;Donga;Huzurabad;Thief;Bharatiya Janata Party;Legend;temple;PartyMon, 24 Apr 2023 08:45:00 GMTతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సవాళ్ల పర్వం సాగుతోంది. కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, భాజపా నేత ఈటెల రాజేందర్‌ ఇద్దరు దొంగ నాటకాలు ఆడుతున్నారని, వారిందరు ఒక్కటే నని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి తాజాగా విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క రూపాయి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం సాక్షిగా ప్రమాణం చేశారని...ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడని ఆనాడు నేను చెప్పానని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.


ఇవాళ ఈటెల రాజేందర్ వ్యాఖ్యల పై స్పందించిన రేవంత్... ఆనాడు నేను చేసిన వ్యాఖ్యల పై ఎందుకు స్పందించలేదని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి నిలదీశారు. ఈటెల రాజేందర్ ను ఉన్నది ఉన్నట్లు అడుగుతుంటే ఎందుకు అంగీ లాగు చించుకుంటున్నారన్న ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి.. వేం నరేందర్ కొడుకు పెళ్లిలో హుజురాబాద్ ఎన్నికల డీల్ కుదిరిన మాట నిజమని తెలిపారు.  25 కోట్ల డబ్బులు లెజెండ్ రెస్టారెంట్ లో డబ్బులు మార్చుకుంది నిజం కాదా అని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.


హుజురాబాద్ ఇల్లంతకుంట రాముడి గుడి సాక్షిగా ప్రమాణం చేద్దామా... టైం ఈటెల రాజేందర్ చెప్పినా సరే నన్ను చెప్పామన్నా సరేనని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి సవాల్‌ విసిరారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 25కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ఇచ్చారని... రేవంత్ రెడ్డికి, ఈటెల రాజేందర్ కు తేడాలు రావడంతో మనసులో మాట బయటపడిందని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి అంటున్నారు.


బీజేపీ పార్టీలోని నేతల మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయన్న కౌశిక్‌రెడ్డి... ఈటెల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ కాదు..బ్రోకర్ల కమిటీ చైర్మన్ అని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ఈటెల రాజేందర్ బీజేపీకి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేల్స్ సీఈవో లుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు.





RRR Telugu Movie Review Rating

అమరావతి : పెద్ద పజిల్లా తయారైన వివేకా కేసు

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>