Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e9db6072-ff80-45ad-845e-f4c369b0d64e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e9db6072-ff80-45ad-845e-f4c369b0d64e-415x250-IndiaHerald.jpgసీనియర్ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై శరత్‌బాబుకు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులతో పాటు, కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో శరత్‌బాబు బాధపడుతున్నాడు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించారు. విలక్షణ నటుడు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాలలో 220కిపైగా సినిమాల్లో నటించారు. కథ నాయకుడుగానే కాకుండా విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించారు. శరత్ బాబు 1951 జుSocialstars lifestyle {#}Singeetham Sreenivasarao;K Balachander;American Samoa;sarath babu;sharath;Sharrath Marar;CBN;Andhra Pradesh;Chitram;Father;marriage;Kannada;Wife;Director;Telugu;Cinemaమరింత విషమంగా మారిన ఆ నటుడు ఆరోగ్య పరిస్థితి....!!మరింత విషమంగా మారిన ఆ నటుడు ఆరోగ్య పరిస్థితి....!!Socialstars lifestyle {#}Singeetham Sreenivasarao;K Balachander;American Samoa;sarath babu;sharath;Sharrath Marar;CBN;Andhra Pradesh;Chitram;Father;marriage;Kannada;Wife;Director;Telugu;CinemaMon, 24 Apr 2023 13:36:34 GMTసీనియర్ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై శరత్‌బాబుకు చికిత్స అందిస్తున్నారు.

ఊపిరితిత్తులతో పాటు, కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో శరత్‌బాబు బాధపడుతున్నాడు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించారు.

విలక్షణ నటుడు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాలలో 220కిపైగా సినిమాల్లో నటించారు. కథ నాయకుడుగానే కాకుండా విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించారు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. కె.ప్రభాకర్, కె.బాబూరావు సినీ రంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్ బాబుగా మార్చారు. హీరోగా శరత్ బాబు తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. ఆ తర్వాత కన్నెవయసు సినిమాలో నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు.

తెలుగులో బాలచందర్ డైరెక్షన్ లో చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు శరత్ బాబు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్ బాబు వెలుగులోకి వచ్చారు. ఆయన చివరిగా కనిపించిన తెలుగు చిత్రం వకీల్ సాబ్.

శరత్ బాబు సినిమాల్లో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను 1974లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్లు పెద్ద. 1988లో విబేధాలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం 1990లో నంబియార్ అనే మహిళను శరత్ బాబు వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా బంధం సవ్యంగా సాగలేదు. 2011లో విడాకులు తీసుకుని విడిపోయారు.

1981, 1988, 1989 సంవత్సరాలలో మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని శరత్ బాబు అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు నంది పురస్కారం పొందారు.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>