Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-46ff7a27-bac3-413e-8996-70b09519e401-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-46ff7a27-bac3-413e-8996-70b09519e401-415x250-IndiaHerald.jpgఅందాల రాక్షసి సినిమా తో వెండి తెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల అందరి మనసులను దోచేసింది. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మంచి అవకాశాల కోసం తెగ ఎదురుచూస్తోంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నే అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా లావణ్య.. తన మంచి మనసును అయితే చాటుకుంది. సాధారణం గా హీరోయిన్లు అందరు తమ వీకెండ్ ను రిసార్ట్ లోనో.. పబ్ లోనో , ఫ్రెండ్స్తోనో బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మా అందాల రాక్షసి మాత్రం తన వీకెండ్ ను ఈసSocialstars lifestyle {#}Anandam;Hyderabad;media;students;Yevaru;BEAUTY;Silver;Heroine;Cinemaమంచి మనసు చాటుకున్న లావణ్య...!!మంచి మనసు చాటుకున్న లావణ్య...!!Socialstars lifestyle {#}Anandam;Hyderabad;media;students;Yevaru;BEAUTY;Silver;Heroine;CinemaMon, 24 Apr 2023 22:37:25 GMTఅందాల రాక్షసి సినిమా తో వెండి తెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల అందరి మనసులను దోచేసింది. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మంచి అవకాశాల కోసం తెగ ఎదురుచూస్తోంది.

 సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నే అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా లావణ్య.. తన మంచి మనసును అయితే చాటుకుంది. సాధారణం గా హీరోయిన్లు అందరు తమ వీకెండ్ ను రిసార్ట్ లోనో.. పబ్ లోనో , ఫ్రెండ్స్తోనో బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మా అందాల రాక్షసి మాత్రం తన వీకెండ్ ను ఈసారి అనాథ ఆశ్రమం లో గడిపిందట.. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహంలో లావణ్య త్రిపాఠి సందడి చేసింది. విధి రాతలో అమ్మా నాన్నలను దూరం చేసుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈ గృహం లో చదివి ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడుతున్నారనే సంగతి తెలుసుకున్న లావణ్య…. ఓరోజు వారితో సరదాగా గడపాలని నిర్ణయించుకుందనీ తెలుస్తుంది. ఈ మేరకు అనాథ విద్యార్థి గృహాన్ని సందర్శించి అక్కడి విశేషాలను వ్యవస్థాపకులు మార్గం రాజేశ్ ను అడిగి తెలుసుకుందట.

విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసింది లావణ్య… విద్యార్థులతో కలిసి మధ్యాహ్నా భోజనం కూడా ఆరగించింది. అనాథ విద్యార్థి గృహంలో పిల్లలకు కావల్సిన అత్యవసర మందులను కూడా కానుకగా అందించి మానవత్వాన్ని చాటుకుంటుంది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా సమాధానమిస్తూ…. తమ కుటుంబంలో ఎవరు సినీ పరిశ్రమతో సంబంధం లేకున్నా….11 ఏళ్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచి నటిగా ఎదిగానని వివరించింది. తనకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఇక లావణ్య మంచి మనసును అభిమానులు అందరూ ప్రశంసిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి సనన్..!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>