MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-teja1134f81-a0e8-419c-9965-cc2a434c80ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-teja1134f81-a0e8-419c-9965-cc2a434c80ec-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా 'విరూపాక్ష' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్లకుSai Tej{#}kushi;prasad;teja;Kushi;V;Sri Venkateswara Cine Chitra;vegetable market;Blockbuster hit;Pawan Kalyan;Success;Karthik;Amarnath K Menon;Audience;Music;Hero;Cinema;Director'విరూపాక్ష' హిట్ తో భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సాయి తేజ్.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా..?'విరూపాక్ష' హిట్ తో భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సాయి తేజ్.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా..?Sai Tej{#}kushi;prasad;teja;Kushi;V;Sri Venkateswara Cine Chitra;vegetable market;Blockbuster hit;Pawan Kalyan;Success;Karthik;Amarnath K Menon;Audience;Music;Hero;Cinema;DirectorMon, 24 Apr 2023 15:55:23 GMTమెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా 'విరూపాక్ష' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా షేర్ రాబట్టి దుమ్ము లేపింది. సాయి ధరంతేజ్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. 

సినిమాలో హారర్, సస్పెన్స్ ఎలివేషన్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో విరూపాక్ష మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో సాయి తేజ్ తన రెమ్యునరేషన్ అమాంతంగా పెంచాడంటూ ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం విరూపాక్ష సినిమా కంటే ముందు ఒక్కో సినిమాకి 8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న తేజు.. ఇకపై తన కొత్త సినిమాలకు ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అంటే ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి రెట్టింపు అన్నమాట.

తేజ్ అంతలా డిమాండ్ చేయడానికి కారణం విరూపాక్ష మూవీతో అతని మార్కెట్ భారీగా పెరిగిపోయింది. కాబట్టి అటు ప్రొడ్యూసర్స్ కూడా ఈ మెగా హీరో అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదట. ఇక విరూపాక్ష హిట్టుతో సాయి తేజ్ తో సినిమా చేయడానికి నిర్మాతలు సైతం ఎంతో ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ తో కలిసి వినోదయ సీతం రీమేక్లో నటిస్తున్నాడు తేజు.కానీ ల్ ఇప్పటివరకు సోలోగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా కమిట్ అవలేదు.  ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మెగా మేనల్లుడు. చాలా గ్యాప్ తర్వాత సాయి తేజ్ కి భారీ సక్సెస్ రావడంతో అతని ఫ్యాన్స్ కూడా ఈ సక్సెస్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సాయి తేజ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది...!!



RRR Telugu Movie Review Rating

బాస్ తో బ్రేక్ ఫాస్ట్ చేసిన దేవిశ్రీ... కారణం...!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>