Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-24abf4ef-06fd-4270-a4fd-bd50e3c6311b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-24abf4ef-06fd-4270-a4fd-bd50e3c6311b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్‌. ఈ ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. కు మంచి అనుబంధం ఉంది. అన్నయ్యా అంటూ దేవిశ్రీ ప్రసాద్.. తమ్ముడూ అంటూ మెగాస్టార్ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఇక దేవిశ్రీ ప్రతిభను గుర్తించిన చిరు.. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరి చూడని డీఎస్సీ సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. ఇప్పటికి మెగాస్టార్ కు ఎన్నో సినిమాలకు దేవిశ్రీ సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు. దేవిశ్రీ ఇతర సినSocialstars lifestyle {#}Konidela Production;sree;shankar;Chiranjeevi;sunday;Hero;Allu Arjun;twitter;Director;Cinemaబాస్ తో బ్రేక్ ఫాస్ట్ చేసిన దేవిశ్రీ... కారణం...!!బాస్ తో బ్రేక్ ఫాస్ట్ చేసిన దేవిశ్రీ... కారణం...!!Socialstars lifestyle {#}Konidela Production;sree;shankar;Chiranjeevi;sunday;Hero;Allu Arjun;twitter;Director;CinemaMon, 24 Apr 2023 20:42:38 GMTటాలీవుడ్‌ స్టార్ హీరో  మెగాస్టార్ చిరంజీవి.. సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్‌. ఈ ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. కు మంచి అనుబంధం ఉంది.

అన్నయ్యా అంటూ దేవిశ్రీ ప్రసాద్.. తమ్ముడూ అంటూ మెగాస్టార్ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఇక దేవిశ్రీ ప్రతిభను గుర్తించిన చిరు.. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరి చూడని డీఎస్సీ సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.

ఇప్పటికి మెగాస్టార్ కు ఎన్నో సినిమాలకు దేవిశ్రీ సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు. దేవిశ్రీ ఇతర సినిమాల మ్యూజిక్ పై కామెంట్లు చేయ్యొచ్చేమో కాని.. మెగా హీరోలకు చేసిన మ్యూజిక్ కు మాత్రం వంకలు పెట్టలేము. చిరుతో చాలా సినిమాల్లో పని చేసి అద్భుతమైన పాటలకు ప్రాణం పోశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక ఈమద్యే వీరికాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.ఈసినిమాలో డీఎస్సీ ట్యూన్స్ కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టెప్పులేసి అలరించారు. ఇక తాజాగా మెగాస్టార్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యాడు దేవిశ్రీ ప్రసాద్.

తాజాగా డీఎస్పీని చిరు తన ఇంటికి ఆహ్వానించారు. ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ విందుకు దేవిశ్రీని ఆహ్వానించి.. ఆతిథ్యం ఇచ్చారు. చిరుతో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోలను డీఎస్పీ ట్విట్టర్ లో అభిమానులతో పంచకున్నారు.అయితే ఇంకో విషయం ఏంటీ అంటే.. ఈ పోటోలు మెగాస్టార్ కూతురు సుస్మిత క్లిక్ చేశారు. ఈఫోటోలు షేర్ చేస్తూ... దేవిశ్రీ ఈ విధంగా రాశారు. బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్‌. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మీరుప్పుడూ మమ్మల్ని స్పెషల్ గా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకెప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్. లవ్‌ యూ సార్‌' అని ఫోస్ట్‌ చేశారు. ఫొటో తీసిన చిరు కూతురు కొణిదెల సుస్మితకు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే, చిరు, డీఎస్పీ భేటీ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సీక్రేట్ ఏంటి డిఎస్పీ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరు సరదాగా బ్రేక్ ఫాస్ట్ కోసమే బేటీ అయ్యారా.. లేక ఇంకేదైనా.. ప్రత్యేకత ఉందా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తన తదుపరి సినిమాలోనూ డీఎస్పీకి చిరు చాన్స్ ఇచ్చారని, మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమే కలిశారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, చిరంజీవి ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్‌' సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్‌ పవన్‌ కల్యాణ్‌ 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌', అల్లు అర్జున్ 'పుష్ప.. ది రూల్‌'కు సంగితం అందిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ పై ఐటీ దాడులు జరగబోతున్నాయా...?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>