Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplee28d0c6-6d04-4310-acec-ddf3eb10d78a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplee28d0c6-6d04-4310-acec-ddf3eb10d78a-415x250-IndiaHerald.jpgవిరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్లలో మొదటి స్థానంలో ఉంటాడు అనే విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన కోహ్లీ.. ప్రపంచవ్యాప్తంగా తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపీఎల్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతూ ఎన్నో అసాధారణమైన ఇన్నింగ్స్ లు ఆడాడు అని చెప్పాలి. అయితే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.Ipl{#}manish;Manish Pandey;Rajasthan;VIRAT KOHLI;INTERNATIONALఏప్రిల్ 23.. కోహ్లీ కెరియర్ లో చీకటి రోజు?ఏప్రిల్ 23.. కోహ్లీ కెరియర్ లో చీకటి రోజు?Ipl{#}manish;Manish Pandey;Rajasthan;VIRAT KOHLI;INTERNATIONALMon, 24 Apr 2023 11:00:00 GMTవిరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్లలో మొదటి స్థానంలో ఉంటాడు అనే విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన కోహ్లీ.. ప్రపంచవ్యాప్తంగా తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపీఎల్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతూ ఎన్నో అసాధారణమైన ఇన్నింగ్స్ లు ఆడాడు అని చెప్పాలి. అయితే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక కోహ్లీ ఇలాంటి అసాధారణమైన అత్యుత్తమమైన క్రికెటర్ కి కూడా ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్లు చాలానే ఉన్నాయని అభిమానులు నమ్ముతూ ఉంటారు. ఇలా కోహ్లీ కెరియర్ లో ఉన్న బ్యాడ్ సెంటిమెంట్లలో ఏప్రిల్ 23వ తేదీ కూడా ఒకటి. ఎందుకంటే ఎప్పుడు ఏప్రిల్ 23వ తేదీ అటు విరాట్ కోహ్లీకి అచ్చి రాదు అని చెప్పాలి. ఆ తేదీ రోజున కోహ్లీ ఎప్పుడు బ్యాటింగ్ చేసిన పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెను తిరుగుతూ ఉంటాడు. ఇక ఇటీవల ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా ఇదే జరిగింది. దీంతో కోహ్లీ బ్యాడ్ సెంటిమెంట్ గురించిన వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఎందుకంటే ఐపీఎల్లో ఏప్రిల్ 23వ తేదీన బెంగళూరు జట్టు తరఫున ఆడిన 3 మ్యాచ్ లలో కూడా కోహ్లీ గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు. ఇక మరో విశేషమేమిటంటే.. కోహ్లీ డక్ అవుట్ అయినా రెండు సందర్భాల్లో బెంగళూరు జట్టు ఓడిపోయింది.


 ఏప్రిల్ 23, 2017 : కోల్కతా జట్టుతో మ్యాచ్ లో తొలి బంతికే గోల్డెన్ డకౌట్ వెనుతిరిగాడు. నాథన్ కౌల్టర్ నీల్ బౌలింగ్లో మనీష్ పాండేకి క్యాచ్ ఇచ్చి చివరికి పేవిలియన్ బాట పట్టాడు.

 ఏప్రిల్ 23, 2022  : బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మార్కో జాన్సన్ బౌలింగ్లో మార్గరమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు విరాట్ కోహ్లీ.


 ఏప్రిల్ 23, 2023 : ఇక ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా కోహ్లీ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డకౌట్ గా వెనతిరిగాడు అని చెప్పాలి. కానీ ఈ మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్ లలో బెంగళూరు ఓడిపోయింది.



RRR Telugu Movie Review Rating

"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>