MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saidharamtejbe63c099-998b-42b1-900d-e9a804164730-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saidharamtejbe63c099-998b-42b1-900d-e9a804164730-415x250-IndiaHerald.jpgరెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డుప్రమాదం నుండి బయటపడ్డ సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటించిన ‘విరూపాక్ష’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడ ఈమూవీకి రావడంతో తేజ్ తన మొదటి పరీక్షలో నెగ్గాడు. ఈమూవీ సక్సస్ అతడి కెరియర్ కు ఎంతో కీలకమే కాకుండా అతడికి మానసిక ధైర్యాన్ని అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు.ఈమూవీని చూసిన సగటు ప్రేక్షకుడు తేజ్ లుక్ పై చేస్తున్న కామెంట్స్ కొంత ఆశక్తి దాయకంగా కనిపిస్తున్నాయి. ‘విరూపాక్ష’ సినిమా కథ స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నప్పటికీ సాయి ధ‌ర‌మ్saidharamtej{#}Accident;Athadu;sai dharam tej;kalyan;Salman Khan;Remake;Cinema;Newsసాయి ధరమ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ పై సందేహాలు ?సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ పై సందేహాలు ?saidharamtej{#}Accident;Athadu;sai dharam tej;kalyan;Salman Khan;Remake;Cinema;NewsMon, 24 Apr 2023 08:00:00 GMTరెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డుప్రమాదం నుండి బయటపడ్డ సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటించిన ‘విరూపాక్ష’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడ ఈమూవీకి రావడంతో తేజ్ తన మొదటి పరీక్షలో నెగ్గాడు. ఈమూవీ సక్సస్ అతడి కెరియర్ కు ఎంతో కీలకమే కాకుండా అతడికి మానసిక ధైర్యాన్ని అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు.

 

 

ఈమూవీని చూసిన సగటు ప్రేక్షకుడు తేజ్ లుక్ పై చేస్తున్న కామెంట్స్ కొంత ఆశక్తి దాయకంగా కనిపిస్తున్నాయి. ‘విరూపాక్ష’ సినిమా కథ స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నప్పటికీ సాయి ధ‌ర‌మ్ తేజ్ లుక్ అతడి స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం తేడాగా కనిపించాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో తేజ్ తన సినిమాలలో చాల ఉత్సాహంగా కనిపించేవాడు. అతడి డాన్స్ మూమెంట్స్ కూడ చాల బాగుండేవి.

 

 
అయితే ఈమూవీలో అతడి కదలికలు డల్ గా కనిపించాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈసినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ లో అతడు నీర‌సంగా కనిపించడం మరికొందరిని ఆశ్చర్య పరిచింది. ఈవిషయాలను నిశితంగా పరిశీలించిన కొందరు యాక్సిడెంట్ తాలూకు ప్ర‌భావం శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా కూడా తేజ్ మీద ప‌డిందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.

 

 
ఈసినిమా హిట్ అవ్వడంతో ఈనెగిటివ్ కామెంట్స్ ఎఫెక్ట్ ఈమూవీ పై ఉండకపోవచ్చు. అయితే జూలైలో పవన్ కళ్యాణ్ తో కలిసి తేజ్ నటిస్తున్న ‘వినోదయ సితం’ రీమేక్ విడుదలకాబోతున్న పరిస్థితులలో ఆమూవీలో అతడి లుక్ అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ ను బట్టి అతడి భవిష్యత్ కెరియర్ పై ప్రభావం చూపే ఆస్కారం కనిపిస్తోంది. ‘విరూపాక్ష’ మూవీతో విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీకి డివైడ్ టాక్ రావడంతో సాయి ధరమ్ తేజ్ అదృష్టవంతుడు అయ్యాడు అనుకోవాలి..

 





RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>