EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/same-sex737f22bd-b802-4a20-b006-c363001ed086-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/same-sex737f22bd-b802-4a20-b006-c363001ed086-415x250-IndiaHerald.jpgస్వలింగ సంపర్కుల గురించి సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. కానీ సుప్రీం కోర్టు తమకు అన్ని విషయాలపై విచారణ చేసే అధికారం ఉందని తేల్చి చెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవాలని రాజ్యాంగంలో లేదు. పోనీ ఏదైనా మతంలో ఉందా అంటే అది కూడా లేదు. హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్ ఇలాంటి మతాల్లో కూడా స్త్రీ, పురుషుడు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి పెళ్లిళ్లు అనేవి లేవని వాదించింది. ఇలా చేసుకునే వారి కSAME SEX{#}marriage;Husband;central government;Supreme Courtఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?SAME SEX{#}marriage;Husband;central government;Supreme CourtMon, 24 Apr 2023 07:00:00 GMTస్వలింగ సంపర్కుల గురించి సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. కానీ సుప్రీం కోర్టు తమకు అన్ని విషయాలపై విచారణ చేసే అధికారం ఉందని తేల్చి చెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవాలని రాజ్యాంగంలో లేదు. పోనీ ఏదైనా మతంలో ఉందా అంటే అది కూడా లేదు.


హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్ ఇలాంటి మతాల్లో కూడా స్త్రీ, పురుషుడు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి పెళ్లిళ్లు అనేవి లేవని వాదించింది. ఇలా చేసుకునే వారి కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుందని చెప్పింది. దీనికి సుప్రీం కోర్టు వ్యాఖ్యనిస్తూ ప్రత్యేక వివాహా చట్టం కిందకు వీరికి తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించింది. దీంతో కేంద్రం ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకునే అంశం కాదు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు సుప్రీం కోర్టుకు తెలియజేసింది.


అయితే ఆడ, ఆడ, మగ, మగ పెళ్లి వల్ల సమాజంలో అనేక దుష్పరిణామాలు ఉంటాయి. దీని వల్ల చాలా చట్టాలను మార్చాల్సి వస్తుంది. పెళ్లయి పిల్లలు లేని దంపతులకు ఇది వరకు పిల్లలను దత్తత ఇచ్చేందుకు కొన్ని చట్టాలు ఉండేవి. మరి స్వలింగ సంపర్కులకు ఎలా వర్తిస్తాయి. వివాహితపై గృహహింస చట్టం పేరుతో భర్తపై కేసు పెట్టే అవకాశం ఉంది.


పెళ్లి అయిన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత విడిపోతే భర్త భరణం చెల్లించే చట్టం ఉంది. ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారం వివాహ చట్టంలో ఉంది. కానీ స్వలింగ సంపర్క జీవనం అనేది కొత్త రకమైనది. దీనికి ఎలా అనుమతి ఇవ్వగలం. ఒకవేళ ఇచ్చిన అనంతరం ఏర్పడే సమస్యలకు పరిష్కారం ఎలా చూపగలం. ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఇప్పుడు రాష్ట్రాల పరిధిలోకి వచ్చింది. మరి రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయాలను చెబుతాయో చూడాలి.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>