Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f02f7814-9c37-447c-8c1a-69b1a7853a27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f02f7814-9c37-447c-8c1a-69b1a7853a27-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ను మించిన క్రికెటర్ ఇంకొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్లోనూ సచిన్ లెజెండ్ గా కొనసాగుతున్నాడు. సచిన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ సచిన్ రికార్డులు మాత్రం పదిలంగానే ఉన్నాయి అంటే ఇక అతని ప్రస్థానం ఎంత విజయవంతంగా కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నేటి రోజుల్లో సచిన్ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టగలిగే క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే అని ప్రపంచ కCricket {#}Australia;Prasthanam;Yevaru;VIRAT KOHLI;Sachin Tendulkar;Legend;Cricketరిటైర్ అయ్యాకే.. కోహ్లీని సచిన్ తో పోలిస్తే బెటర్ : పాంటింగ్రిటైర్ అయ్యాకే.. కోహ్లీని సచిన్ తో పోలిస్తే బెటర్ : పాంటింగ్Cricket {#}Australia;Prasthanam;Yevaru;VIRAT KOHLI;Sachin Tendulkar;Legend;CricketMon, 24 Apr 2023 13:00:00 GMTభారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ను మించిన క్రికెటర్ ఇంకొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్లోనూ సచిన్ లెజెండ్ గా కొనసాగుతున్నాడు. సచిన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ సచిన్ రికార్డులు మాత్రం పదిలంగానే ఉన్నాయి అంటే ఇక అతని ప్రస్థానం ఎంత విజయవంతంగా కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నేటి రోజుల్లో సచిన్ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టగలిగే క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు చెబుతూ ఉంటారు.


 ఎందుకంటే ఇప్పటికే సచిన్ సాధించిన ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు సచిన్ 100 సెంచరీల రికార్డుపై కూడా కన్నేసాడు. ఇప్పటికే 76 సెంచరీలతో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఎంతోమంది విరాట్ కోహ్లీని సచిన్ టెండూల్కర్ తో పోల్చి చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ సాంకేతికంగా అత్యుత్తమమైన బ్యాట్స్మెన్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాతే అతన్ని సచిన్ తో పోలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.


 నా కెరియర్ మొత్తంలో నా ప్రత్యర్ధుల్లో నేను కలిసి ఆడిన వారిలో అత్యుత్తమమైన సాంకేతిక బ్యాట్స్మెన్ ఎవరు అంటే సచిన్ అని చెబుతాను. మేము బౌలింగ్ లో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగిన సచిన్ మమ్మల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేవాడు. నా తరంలో నేను చూసిన గొప్ప బ్యాట్స్మెన్ అతనే అంటూ చెప్పుకొచ్చాడు. సచిన్ తో కోహ్లీని  పోల్చడాన్ని తిరస్కరించాడు. ఆట మారింది నిబంధనలు మారాయ్. ఇప్పుడు బ్యాటింగ్ చేయడం తేలిక. విరాట్కు ఇంకా చాలా సమయం కూడా ఉంది. అతను మంచి బ్యాట్స్మెన్ అనడంలో సందేహం లేదు. అయితే కోహ్లీ రిటైర్ అయిన తర్వాతే సచిన్ తో పోల్చడం సమంజసం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు రికీ పాంటింగ్.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>