EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congress54d76a1b-a7aa-436f-9f63-39b348db24e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congress54d76a1b-a7aa-436f-9f63-39b348db24e2-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీని క్రియాశీలకంగా ఉంచేందుకు ప్లాన్ రెడీ చేసింది. తాజాగా ఇవాళ్టి నుంచి విద్యార్ధి, నిరుద్యోగ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరసుగా నిరుద్యోగ నిరసన ర్యాలీలను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనుంది. టిఎస్‌పిఎస్‌సీ పేపర్‌ లీకేజి ప్రభావం దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులపై పడిందంటున్న కాంగ్రెస్‌.. దీనిని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగుల తరఫున పోరాటానికి రెడీ అయ్యింది. ఇవాళ ఖమ్మంలో, ఈ నెల 26న అదిలాబాద్‌, ఈ నెల 28వ తేదీన నలcongress{#}Ranga Reddy;Khammam;Police Station;Elections;Evening;Congress;Party;Bharatiya Janata Partyనిరుద్యోగ ర్యాలీలతో కదం తొక్కనున్న కాంగ్రెస్‌?నిరుద్యోగ ర్యాలీలతో కదం తొక్కనున్న కాంగ్రెస్‌?congress{#}Ranga Reddy;Khammam;Police Station;Elections;Evening;Congress;Party;Bharatiya Janata PartyMon, 24 Apr 2023 09:30:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీని క్రియాశీలకంగా ఉంచేందుకు ప్లాన్ రెడీ చేసింది. తాజాగా ఇవాళ్టి నుంచి విద్యార్ధి, నిరుద్యోగ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరసుగా నిరుద్యోగ నిరసన ర్యాలీలను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనుంది. టిఎస్‌పిఎస్‌సీ పేపర్‌ లీకేజి ప్రభావం దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులపై పడిందంటున్న కాంగ్రెస్‌.. దీనిని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగుల తరఫున పోరాటానికి రెడీ అయ్యింది.


ఇవాళ  ఖమ్మంలో, ఈ నెల 26న అదిలాబాద్‌, ఈ నెల 28వ తేదీన నల్గొండ, 30వ తేదీన మహబూబ్‌నగర్‌, వచ్చే నెల ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లాల్లో సన్నాహక ర్యాలీలు నిర్వహిస్తోంది. అందరి ఆమోదయోగ్యంతో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఖమ్మం పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారీ ప్రదర్శన ఉంటుంది. మయూరి సెంటర్, పాత బస్టాండ్ వరకు ఈ  ప్రదర్శన కొనసాగుతుంది.ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు ఇతర సినియర్‌ నాయకులు పాల్గొంటారు.


కాంగ్రెస్‌ పార్టీ వచ్చే నెల నాలుగైదు తేదీలల్లో హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌ స్టేడియంలో బారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించడంలో భాగంగా రోజుకొక విశ్వవిద్యాలయాన్నిసందర్శించి అక్కడ నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేతలు ఎండగడతారు. ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై మరింత ఒత్తిడి పెంచి సిట్టింగ్‌ జడ్జికాని, సీబీఐకి కాని అప్పగించాలంటూ  కాంగ్రెస్ నేతలు  డిమాండ్‌ చేస్తున్నారు.


ఇప్పటికే న్యాయస్థానాన్నిఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి విభాగం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  నిరుద్యోగ నిరసన సభ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజావ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకోవచ్చని  కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అటు బీఆర్‌ఎస్‌.. ఇటు కాంగ్రెస్‌.. మరోవైపు బీజేపీ వరుసగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ఎన్నికల వాతావరణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>