Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bapagambc5c3b01-af87-4755-9f3e-f1448979f9b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bapagambc5c3b01-af87-4755-9f3e-f1448979f9b4-415x250-IndiaHerald.jpgసాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా చిన్న సినిమాగా వచ్చి ప్రతి ఒక్కరి మధిలో చోటు సంపాదించుకున్న సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇక మనుషుల్లో కనుమరుగైపోతున్న మానవ బంధాలను మరోసారి తట్టి లేపింది. ఇక చిన్న చిన్న గొడవలతో దూరంగా ఉంటున్న అక్క చెల్లెళ్లను, అన్నదమ్ములను దగ్గర చేసింది. బంధాలు బంధుత్వాల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఎంత బాగుంటాయి అనే విషయాన్నBapagam{#}praveen;Venu Thottempudi;Jabardasth;prema;Love;Director;Cinemaఏడిపించిన 'బలగం' పాటతో.. కడుపుబ్బ నవ్వించారుగా?ఏడిపించిన 'బలగం' పాటతో.. కడుపుబ్బ నవ్వించారుగా?Bapagam{#}praveen;Venu Thottempudi;Jabardasth;prema;Love;Director;CinemaMon, 24 Apr 2023 09:30:00 GMTసాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా చిన్న సినిమాగా వచ్చి ప్రతి ఒక్కరి మధిలో చోటు సంపాదించుకున్న సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇక మనుషుల్లో కనుమరుగైపోతున్న మానవ బంధాలను మరోసారి తట్టి లేపింది. ఇక చిన్న చిన్న గొడవలతో దూరంగా ఉంటున్న అక్క చెల్లెళ్లను, అన్నదమ్ములను దగ్గర చేసింది.



 బంధాలు బంధుత్వాల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఎంత బాగుంటాయి అనే విషయాన్ని ఈ సినిమా కళ్ళకు కట్టినట్లుగా చూపించింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివర్లో వచ్చే ఓ పాట ఒక ఎత్తు. తోడుగా మా తోడుండి అనే సాంగ్ అయితే కఠినమైన హృదయం కలిగిన వాళ్ళను కూడా కన్నీరు పెట్టించింది. ఇక ఈ సాంగ్ ఎప్పుడు విన్నా కూడా అటు ప్రేక్షకులందరికీ కూడా ఒకే ఫీల్ కలుగుతూ ఉంటుంది. ఇలా ఇంతలా ప్రేక్షకుల గుండెలు పిండేసి కన్నీళ్లు తెప్పించే సాంగ్ ఇటీవల కాలంలో రాలేదు అనడంలోనూ అతిశయోక్తి లేదు.


 అయితే ఇలాంటి ఎమోషనల్ సాంగ్ ని ఇటీవల కమెడియన్స్ స్పూఫ్ చేసి నవ్వులు పూయించారు. ఇటీవల విడుదలైన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అయితే జబర్దస్త్ కి అటు బలగం డైరెక్టర్ వేణు గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ఈ కార్యక్రమంలో ఉన్న ఇతర కమెడియన్స్ గురించి మాట్లాడుతూ.. బలగం సినిమా స్పూఫ్ చేస్తూ పాట పాడాడు. దీంతో అందరినీ ఏడిపించిన పాట ప్రవీణ్ నోట విని ప్రతి ఒక ప్రేక్షకుడు నవ్వుకుంటున్నాడు అని చెప్పాలి. కాగా ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
">



RRR Telugu Movie Review Rating

"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>