Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b5534c15-e8ea-4b45-b500-b768d877b58d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b5534c15-e8ea-4b45-b500-b768d877b58d-415x250-IndiaHerald.jpgఈ మధ్య సీనియర్ నటీనటులు కూడా సోషల్ మీడియాలో బాగా సమయాన్ని కాలక్షేపం చేస్తున్నారు. తాము కూడా తమ సినిమా అప్డేట్లను, తమ ఫోటోలను కూడా పంచుకుంటున్నారఅందులో ఒకరు జగపతిబాబు. సీనియర్ నటుడు జగపతిబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో హీరోగా ఓ వెలుగు వెలిగాడు జగపతిబాబు.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో హీరోగా నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇప్పటికీ ఇండసSocialstars lifestyle {#}Ramzan;jagapati babu;Success;bollywood;Salman Khan;Telugu;Industry;Hero;News;Cinemaసల్మాన్ ఖాన్ గూర్చి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన జగపతి బాబు....!!సల్మాన్ ఖాన్ గూర్చి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన జగపతి బాబు....!!Socialstars lifestyle {#}Ramzan;jagapati babu;Success;bollywood;Salman Khan;Telugu;Industry;Hero;News;CinemaMon, 24 Apr 2023 08:15:33 GMTఈ మధ్య సీనియర్ నటీనటులు కూడా సోషల్ మీడియాలో బాగా సమయాన్ని కాలక్షేపం చేస్తున్నారు. తాము కూడా తమ సినిమా అప్డేట్లను, తమ ఫోటోలను కూడా పంచుకుంటున్నారఅందులో ఒకరు జగపతిబాబు. సీనియర్ నటుడు జగపతిబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో హీరోగా ఓ వెలుగు వెలిగాడు జగపతిబాబు.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో హీరోగా నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ తన పాత్రలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు.

తొలిసారిగా 1992లో అసాధ్యులు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జగపతి బాబు ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకొని వెనుతిరగకుండా వరుస సినిమాలలో నటించాడు. ఇక మధ్యలో కొన్ని ఏళ్ళు ఇండస్ట్రీకి దూరమైన జగపతిబాబు మళ్లీ రీ ఎంట్రీ తో వయసుకు తగ్గ పాత్రలనే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటించాడు. ఒక హీరోగానే కాకుండా హీరో హీరోయిన్స్ కు తండ్రిగా, విలన్ పాత్రగా కూడా జగపతి బాబు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు.విలన్ పాత్రతో కూడా అందర్నీ మెప్పిస్తూ వరుసగా అవే అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పటికీ జగపతిబాబు లుక్ ఏం మాత్రం మారలేదు. ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా ఈమధ్య బాగా వర్కౌట్లు కూడా చేస్తున్నాడు. ఇక ఈయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి బాగా పోస్ట్లు షేర్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో దిగిన ఫోటోను పంచుకున్నాడు. నిన్న రంజాన్ పండుగ సందర్భంగా సల్మాన్ ఖాన్ తో సమయాన్ని గడిపినట్లు కనిపించాడు. ఈ సందర్భంగా ఆ ఫోటో పంచుతూ.. నా శత్రువే నా మిత్రుడు. నా జీవితంలో ఈద్ అనేది ఎంజాయ్ చేసిన రోజు అంటూ పంచుకున్నాడు. అయితే దీంతో చాలామంది శత్రువు మిత్రుడు అవడం ఏంటి అని ఆలోచిస్తున్నారు.అయితే అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం జగపతిబాబు సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు జగపతిబాబు. ఇక ఆ సినిమా కోసం జగపతిబాబు భారీ వర్కౌట్లు చేస్తూ కూడా కష్టపడుతున్నాడు. అయితే ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ కు శత్రువుగా జగపతిబాబు నటిస్తున్నాడని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ విధంగా ఆయన శత్రువు మిత్రుడు అయ్యాడు అని అన్నాడేమో అని అనుకుంటున్నారు కొందరు జనాలు.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>