PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana996bcf33-1fed-4689-83a9-282ce805ef7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana996bcf33-1fed-4689-83a9-282ce805ef7f-415x250-IndiaHerald.jpgక్యాన్సర్ జబ్బు ఒక్కసారి సోకిందంటే చాలు ఇక దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఈ వ్యాధి చికిత్సకయ్యే ఖర్చు కూడా చాలా భారీగానే ఉంటుందనే విషయం తెలిసిందే.ముఖ్యంగా కిమో థెరపీ చేయించాలంటే ఖచ్చితంగా వేలల్లో చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు శుభవార్త తెలిపారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో కీమోథెరపీ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఫస్ట్ టైం సిద్ధిపేటలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.ప్రస్తుతం హైదరాబాదTELANGANA{#}District;Cancer;Siddipet;Telangana;sunday;Ministerతెలంగాణ: క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స?తెలంగాణ: క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స?TELANGANA{#}District;Cancer;Siddipet;Telangana;sunday;MinisterSun, 23 Apr 2023 17:37:02 GMTతెలంగాణ: క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స?

క్యాన్సర్ జబ్బు ఒక్కసారి సోకిందంటే చాలు ఇక దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఈ వ్యాధి చికిత్సకయ్యే ఖర్చు కూడా చాలా భారీగానే ఉంటుందనే విషయం తెలిసిందే.ముఖ్యంగా కిమో థెరపీ చేయించాలంటే ఖచ్చితంగా వేలల్లో చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు శుభవార్త తెలిపారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో కీమోథెరపీ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఫస్ట్ టైం సిద్ధిపేటలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.ప్రస్తుతం హైదరాబాద్‌ నగరరంలోనే అందుతున్న కీమోథెరపీ సేవలను జిల్లా కేంద్రాల్లో కూడా అందించడమే తమ లక్ష్యమని హరీష్‌ రావు తెలిపారు. సిద్దిపేట జీజీహెచ్‌ ఆస్పత్రిలో డే కేర్‌ కీమోథెరపీ ప్రత్యేక వింగ్‌ను మంత్రి హరీశ్‌ రావు ఆదివారం నాడు ప్రారంభించారు. నాలుగు బెడ్స్‌తో ఈ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.


ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డే కేర్‌ కీమోథెరపీ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.ఇంకా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ఎలాగైతే డయాలసిస్‌ సర్వీస్ లు అందుతున్నాయో.. అలాగే క్యాన్సర్‌ సర్వీస్ లు కూడా అందిస్తాము. మొదటి సైకిల్‌ ఎంఎన్‌జే ఇంకా నిమ్స్‌లో ఇస్తారు.. మిగతా సైకిల్‌ ట్రీట్‌మెంట్‌ జిల్లా ఆస్పత్రిలోనే మీరు తీసుకోవచ్చు. ప్రతి సైకిల్‌కు పేషెంట్‌కు ఆరు గంటల టైం పడుతుంది. ఇక ఈ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో సైకిల్‌కు దాదాపు రూ.30వేలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే ఉచితంగా అందిస్తాము. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం. మొత్తం 468 మంది క్యాన్సర్‌ పేషెంట్లు ఉన్నారు.అయితే వీరిలో కొందరికి కీమో థెరపీ అవసరం ఉంటుంది’ అని హరీష్‌ రావు చెప్పుకొచ్చారు.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: ఇది పక్కా పాన్ ఇండియా మూవీ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>