PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpfcfae6ac-f35a-4b22-ad80-8ad66bbdec1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpfcfae6ac-f35a-4b22-ad80-8ad66bbdec1c-415x250-IndiaHerald.jpgదెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలతో గన్నవరం పార్టీలోని డొల్లతనం బయటపడింది. చింతమనేని మాట్లాడుతు గన్నవరంలో టికెట్ ఇస్తే ఖర్చు పెట్టుకోవటానికి రు. 150 కోట్లతో ఒకళ్ళు రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఒకళ్ళన్నారే కానీ ఆ ఒక్కళ్ళు ఎవరో చెప్పలేదు. దాంతో నియోజకవర్గంలోని తమ్ముళ్ళల్లో ఎవరు గట్టివాళ్ళు లేరన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. రాబోయే ఎన్నికల్లో గట్టి అభ్యర్ధిని వెదికేందుకు జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి బాధ్యత అప్పగించారు. Gannavaram tdp vamsi chandrababu{#}prabhakar;Amarnath Cave Temple;Krishna River;Chintamaneni Prabhakar;gannavaram;Yarlagadda Venkatrao;Parakala Prabhakar;MLA;MP;District;CBN;YCP;Party;Yevaruఅమరావతి : ఇంత కీలకమైన నియోజకవర్గంలో కూడా అభ్యర్ధిలేరా ?అమరావతి : ఇంత కీలకమైన నియోజకవర్గంలో కూడా అభ్యర్ధిలేరా ?Gannavaram tdp vamsi chandrababu{#}prabhakar;Amarnath Cave Temple;Krishna River;Chintamaneni Prabhakar;gannavaram;Yarlagadda Venkatrao;Parakala Prabhakar;MLA;MP;District;CBN;YCP;Party;YevaruSun, 23 Apr 2023 09:00:00 GMT



కీలకమైన రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఒకేలాగుంది. రెండు నియోజకవర్గాల్లోను గట్టి అభ్యర్ధులు లేక పార్టీ నానా అవస్తలు పడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంత కీలకమైనవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలాంటి చోట్ల పార్టీకి సరైన అభ్యర్ధులు దొరకటంలేదు. గుడివాడలో కొడాలినాని, గన్నవరంలో వల్లభనేని వంశీలను ఓడించేందుకు ధీటైన అభ్యర్ధులను వెతకటంలోలనే చద్రబాబునాయుడుకు పుణ్యకాలం గడిచిపోతోంది.





దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలతో గన్నవరం పార్టీలోని డొల్లతనం బయటపడింది. చింతమనేని మాట్లాడుతు గన్నవరంలో టికెట్ ఇస్తే ఖర్చు పెట్టుకోవటానికి రు. 150 కోట్లతో ఒకళ్ళు  రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఒకళ్ళన్నారే కానీ ఆ ఒక్కళ్ళు ఎవరో చెప్పలేదు. దాంతో నియోజకవర్గంలోని తమ్ముళ్ళల్లో  ఎవరు గట్టివాళ్ళు లేరన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. రాబోయే ఎన్నికల్లో గట్టి అభ్యర్ధిని వెదికేందుకు జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి బాధ్యత అప్పగించారు.





అయితే ఆయన హఠాత్తుగా పోయారు. దాంతో తాత్కాలికంగా నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణకు అప్పగించారు. అయితే ఆయన కూడా పెద్ద యాక్టివ్ గా లేరు. దాంతో అభ్యర్ధుల వడపోత కార్యక్రమం జరగటంలేదు. వైసీపీలో ఉన్న దాసరి బాలవర్ధనరావు, దాసరి జై రమేష్ తొందరలోనే టీడీపీలో చేరుతారనే ప్రచారం ఉంది. అలాగే వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులో ఒక్కళ్ళు టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.





వీళ్ళల్లో వైసీపీ నుండి టీడీపీలోకి దూకేదెవరు ? టికెట్ తెచ్చుకునేదెవరు ? అనే విషయంలో బాగా అయోమయం పెరిగిపోతోంది. పార్టీ మారబోతున్నట్లు పై నలుగురిలో ఏ ఒక్కళ్ళు చెప్పలేదు. దాంతో ఇప్పటికి పార్టీలోని తమ్ముళ్ళల్లో ఎవరు కూడా వంశీని ఎదిరించేంత సీనున్న వాళ్ళు లేరనేది అర్ధమైపోయింది. ఏకకాలంలో అటు గుడివాడ ఇటు గన్నవరంలో ఇద్దరు ధీటైన అభ్యర్ధులను వెతకాలంటే చంద్రబాబుకు చాలా కష్టమనే చెప్పాలి. మరి చంద్రబాబు ఏమి ప్లాన్ చేస్తున్నారో, చివరినిముషంలో ఎవరిని రంగంలోకి దింపుతారో చూడాల్సిందే. 






RRR Telugu Movie Review Rating

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

అమరావతి : ఇంత కీలకమైన నియోజకవర్గంలో కూడా అభ్యర్ధిలేరా ?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>