Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl360e6972-496b-485f-bc83-b6376157765f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl360e6972-496b-485f-bc83-b6376157765f-415x250-IndiaHerald.jpgమిగతా యువ ప్లేయర్లతో పోల్చి చూస్తే అందరికంటే ఎంతో వేగంగా భారత క్రికెట్ లోకి దూసుకు వచ్చిన యువ సంచలనం పృథ్వి షా మొదటి టెస్ట్ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసి మెరుపు వేగంతో సెంచరీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు అని చెప్పాలి. అయితే 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో ఆడిలైట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి పృథ్వి షా కెరియర్ ఒక్కసారిగా యూటర్న్ తIpl{#}prudhvi raj;Rishabh Pant;U Turn;Delhi;Yuva;Boney Kapoor;Cricket;Indiaఆ అక్కస్సుతోనే.. పృథ్వి షా ఇలా చేస్తున్నాడా?ఆ అక్కస్సుతోనే.. పృథ్వి షా ఇలా చేస్తున్నాడా?Ipl{#}prudhvi raj;Rishabh Pant;U Turn;Delhi;Yuva;Boney Kapoor;Cricket;IndiaSun, 23 Apr 2023 13:00:00 GMTమిగతా యువ ప్లేయర్లతో పోల్చి చూస్తే అందరికంటే ఎంతో వేగంగా భారత క్రికెట్ లోకి దూసుకు వచ్చిన యువ సంచలనం పృథ్వి షా మొదటి టెస్ట్ ఫార్మాట్లోకి అరంగేట్రం  చేసి మెరుపు వేగంతో సెంచరీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు అని చెప్పాలి. అయితే 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో ఆడిలైట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.



 అక్కడి నుంచి పృథ్వి షా కెరియర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది అని చెప్పాలి. బిస్మిన్ టెస్ట్ సమయానికి టీంలో అరడజనుకు పైగా సీనియర్ ప్లేయర్లు గాయాలతో తప్పుకున్నప్పటికీ పృథ్వి షాకు టీం మేనేజ్మెంట్ మాత్రం పట్టించుకోలేదు. జట్టులోకి తీసుకోలేదు. ఇక వన్డే టి20 లోనూ ఒకటి అర ఛాన్సులు మాత్రమే దక్కించుకున్నాడు.  ఇక తర్వాత ఐపీఎల్ లో రాణించి అతని సెలెక్ట్ చేయకపోవడంపై సెలెక్టరుపై విమర్శలు వచ్చేలా చేసాడు. కానీ ఇప్పుడు 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం దారుణమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.


 వరుస పరాజయాలు చవిచూసిన ఢిల్లీ జట్టు ఇటీవల కోల్కతా జట్టుపై బోనీ కొట్టింది. అటు ఓపెనర్ గా బరిలోకి ఎదుగుతున్న పృథ్వి షా ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. మ్యాచ్లో రెండుసార్లు డక్ అవుట్ అవ్వగా.. మిగతా మ్యాచ్ లలో కనీసం 20 పరుగులు కూడా చేయలేక అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒకవేళ పృథ్వి షా ఇదే ఆట తీరు కొనసాగిస్తే వచ్చే ఐపీఎల్ కి ఢిల్లీ అతని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పృథ్వి షా తో కలిసి అండర్ 19 ఆడిన శుభమన్ గిల్ ఇప్పుడు టీమ్ ఇండియా టెస్టులు, వన్డేలో టి20 లో ఆడుతున్నాడు. కానీ పృథ్వి షా ఇంకా ఐపీఎల్ లో ఆడేందుకే కష్టపడుతున్నాడు. అయితే పృథ్వి షా ఫెయిల్యూర్ కి కెప్టెన్సీ ఇవ్వలేదని కోపమే కారణం అని కొంతమంది చర్చించుకుంటున్నారు. పంత్ గాయపడిన తర్వాత పృథ్వి షాకు కెప్టెన్సీ వస్తుందని ఆశపడ్డాడు. కానీ కెప్టెన్సీ దక్కకపోవడంతో ఇలా ఆడుతున్నాడని  కొంతమంది భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలకు "ఏజెంట్" ట్రైలర్ పంపా ... బాగుంది అన్నారు... అఖిల్..!

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>