Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/urder28b95d98-da3c-4a37-93ab-d2d78f31bb98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/urder28b95d98-da3c-4a37-93ab-d2d78f31bb98-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత మనుషుల్లో అసలు మానవ బంధాలకు విలువే లేకుండా పోయింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు పరాయి వాళ్ళు ఎటు పోతే మాకెందుకు. సొంతవారు బాగుంటే చాలు అని అనుకునేవాడు మనిషి. కానీ ఇప్పుడు నేను బాగుంటే చాలు ఎవరు ఎటు పోతే నాకెందుకు అనే విధంగానే ఆలోచిస్తున్నాడు. దీంతో సొంత వారి విషయంలోనే కఠినంగా ప్రవర్తిస్తూన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు నేటి రోజుల్లో మనుషుల మధ్య బంధాలు బంధుత్వాల కంటే ఆస్తులు అంతస్తుUrder{#}Katthi;Andhra Pradesh;police;Murder.;Yevaruఛీ వీడు తండ్రేనా.. ఆస్తి కోసం కొడుకునే?ఛీ వీడు తండ్రేనా.. ఆస్తి కోసం కొడుకునే?Urder{#}Katthi;Andhra Pradesh;police;Murder.;YevaruSun, 23 Apr 2023 14:15:00 GMTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత మనుషుల్లో అసలు మానవ బంధాలకు విలువే లేకుండా పోయింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు పరాయి వాళ్ళు ఎటు పోతే మాకెందుకు. సొంతవారు బాగుంటే చాలు అని అనుకునేవాడు మనిషి. కానీ ఇప్పుడు నేను బాగుంటే చాలు ఎవరు ఎటు పోతే నాకెందుకు అనే విధంగానే ఆలోచిస్తున్నాడు. దీంతో సొంత వారి విషయంలోనే కఠినంగా ప్రవర్తిస్తూన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అంతేకాదు నేటి రోజుల్లో మనుషుల మధ్య బంధాలు బంధుత్వాల కంటే ఆస్తులు అంతస్తులు ఎక్కువ విలువైనవి అని భావిస్తూ.. చివరికి ఆస్తుల కోసం సొంత వారిని కూడా దారుణంగా హతమార్చేందుకు సిద్ధపడుతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలుగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత సొంత వారిని గుడ్డిగా నమ్మితే.. ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా  సభ్య సమాజం తలదించుకునే ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.



 తనను కాదని.. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని సొంత కొడుకు పైన కక్ష పెంచుకున్నాడు. నిరంజన్ అనే వ్యక్తి ఏకంగా ఆస్తికోసం కొడుకును చంపేందుకే సుపారీ ఇచ్చాడు అని చెప్పాలి. ఈ ఘటన నంద్యాలలోని డోన్ లో వెలుగులోకి వచ్చింది. ఇక హత్య చేయించడం కోసం సుఫారీ ఇచ్చి చివరికి కొడుకుని కిడ్నాప్ చేయించి చిత్రహింసలు పెట్టాడు. ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నాడు. అయితే ముందుగా ఇక బాండ్ పేపర్ల పై సంతకాలు చేసేందుకు కొడుకు వినోద్ నిరాకరించడంతో.. ఏకంగా అతని రెండేళ్ల కూతురు మెడపై కత్తి పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా బాధితుడు వెంటనే తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇక ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు పరాలిలో ఉన్న నాలుగో వ్యక్తి గురించి గాలింపు చర్యలు చేపట్టారు.



RRR Telugu Movie Review Rating

"కస్టడీ" మూవీ నుండి "టైమ్ లెస్ లవ్" సాంగ్ విడుదల..!

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>