PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-telangana-chandrababu-9d1f6515-cfd5-448b-b70e-f078175af6bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-telangana-chandrababu-9d1f6515-cfd5-448b-b70e-f078175af6bc-415x250-IndiaHerald.jpgఇక 2014-19 మధ్యలో తాను ఏపీలో కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కల్పించానని, నిరుద్యోగ భృతి ఇచ్చానని చెప్పారు. బద్వేలు, గిద్దలూరు పర్యటనల్లో చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేశారు. అబద్ధాలు చెప్పటంలో అయినా కొత్తవి చెప్పాలన్న ఆలోచన రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. హైటెక్ సిటీని చంద్రబాబు కట్టలేదు. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టుతో అసలు చంద్రబాబుకు సంబంధమే లేదు. ఏపీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇచ్చిన సంగతి చాలామందికి తెలీదు. tdp chandrababu {#}software;Giddalur;job;TDP;Jagan;Hanu Raghavapudi;Reddy;Industry;CBNఅమరావతి : చంద్రబాబు అప్ డేట్ కాలేదా ?అమరావతి : చంద్రబాబు అప్ డేట్ కాలేదా ?tdp chandrababu {#}software;Giddalur;job;TDP;Jagan;Hanu Raghavapudi;Reddy;Industry;CBNSun, 23 Apr 2023 07:00:00 GMT



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటమే కానీ కనీసం అబద్ధాలు చెప్పటం కూడా రాదు. 2014 ఎన్నికల్లో ఏవైతే అబద్ధాలు చెప్పారో మళ్ళీ ఇపుడు అవే అబద్ధాలను చెబుతున్నారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అంటు మొదలుపెట్టారు. హౌదరాబాద్ ను తానే డెవలప్ చేశానని, హైటెక్ సిటీ కట్టానని, ఔటర్ రింగ్ రోడ్డు తానే వేశారట,  మెట్రో ప్రాజెక్టు తానే తెచ్చానని ఇలా చాలా అబద్ధాలను చాలా తేలిగ్గా చెప్పేశారు.





ఇక 2014-19 మధ్యలో తాను ఏపీలో కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కల్పించానని, నిరుద్యోగ భృతి ఇచ్చానని చెప్పారు. బద్వేలు, గిద్దలూరు పర్యటనల్లో చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేశారు. అబద్ధాలు చెప్పటంలో అయినా కొత్తవి చెప్పాలన్న ఆలోచన రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. హైటెక్ సిటీని చంద్రబాబు కట్టలేదు. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టుతో అసలు చంద్రబాబుకు సంబంధమే లేదు. ఏపీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇచ్చిన సంగతి చాలామందికి తెలీదు.





ఇక ఇంటికో ఉద్యోగం హామీ కూడా పూర్తిగా అబద్ధమే. నిరుద్యోగ భృతిని 2019 ఎన్నికలకు కేవలం ఆరుమాసాలుండగా మాత్రమే మొదలుపెట్టారు. అదికూడా ఎక్కువ టీడీపీ కార్యకర్తలనే ఎంపికచేశారనే ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. అంటే ఉద్యోగాలు ఇవ్వలేదు..భృతీ సరిగా ఇవ్వలేదు. అలాంటిది మళ్ళీ 2024లో అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చేశారు.  చూస్తుంటే అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు అప్ డేట్ అయినట్లు లేరు.




విచిత్రం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికో ఉద్యోగమిస్తానని యువతను మోసం చేసినట్లు ఆరోపించటం. ఇంటికో ఉద్యోగమిస్తానని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. పైగా అధికారంలోకి రాగానే వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పేరుతో సుమారు 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు. అవన్నీ బోగస్సని చంద్రబాబు మండిపోతున్నారు. హామీలివ్వటంలో, తప్పటంలో చంద్రబాబును మించిన వాళ్ళు ఎక్కడా ఉండరని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అయినా తన రికార్డును తానే బ్రేక్ చేసుకోవాలని అనుకుంటున్నట్లున్నారు. మరి సాధ్యమవుతుందా ?




RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు అప్ డేట్ కాలేదా ?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>