Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni839bcddc-21c7-4f4e-af70-68ac56b2d2f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni839bcddc-21c7-4f4e-af70-68ac56b2d2f9-415x250-IndiaHerald.jpgభారతమాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం కేవలం ఐపిఎల్ లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఐపీఎల్ సీజన్ కూడా ధోని అభిమానులందరూ కూడా మిస్ కాకుండా వీక్షిస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభమవుతుందా మిస్టర్ కూల్ ఆటను ఎప్పుడు చూస్తామో అని వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరిది అంటూ ఐపీఎల్ ముందు నుంచే వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపDhoni{#}MS Dhoni;prema;Chennai;INTERNATIONAL;Mister;Love;Newsకెరియర్ చివరి దశలో ఉన్నాను.. ధోని కీలక వ్యాఖ్యలు?కెరియర్ చివరి దశలో ఉన్నాను.. ధోని కీలక వ్యాఖ్యలు?Dhoni{#}MS Dhoni;prema;Chennai;INTERNATIONAL;Mister;Love;NewsSun, 23 Apr 2023 12:30:00 GMTభారతమాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం కేవలం ఐపిఎల్ లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఐపీఎల్ సీజన్ కూడా ధోని అభిమానులందరూ కూడా మిస్ కాకుండా వీక్షిస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభమవుతుందా మిస్టర్ కూల్ ఆటను ఎప్పుడు చూస్తామో అని వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ధోనీకి  చివరిది అంటూ ఐపీఎల్ ముందు నుంచే వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు.


 అయితే ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫిట్నెస్ దృశ్య అతను ఇంకా రెండు మూడు ఐపిఎల్ సీజన్లు ఆడుతాడని.. సహచర ఆటగాళ్లు.. ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. దీంతో ధోని మనసులో ఏముందో తెలియక అభిమానులు అందరూ కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోయారు. ఇప్పటికే పలుమార్లు రిటైర్మెంట్ ల పేరుతో అభిమానులకు ట్విస్ట్ ఇచ్చాడు ధోని.


 ఇక ఇప్పుడు ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఎప్పుడు ట్విస్ట్ ఇస్తాడేమో అని భయపడిపోతున్నారు అభిమానులు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మహేంద్ర సింగ్ ధోని తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఏం చెప్పినా ఏం చేసినా.. ఇది నా కెరియర్ చివరి దశ.. ప్రతి మ్యాచ్ ని కూడా ఎంతగానో ఆస్వాదిస్తున్నాను అంటూ ధోని చెప్పుకొచ్చాడు. తాను చెన్నై టీం తో ఉండడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ ఆప్యాయతను చూపించారు అంటూ ధోని తెలిపాడు. ఈ సీజన్లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ బాధ లేదు. మా జట్టు బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలకు "ఏజెంట్" ట్రైలర్ పంపా ... బాగుంది అన్నారు... అఖిల్..!

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>