MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-starsb5d1ec33-0312-458a-96aa-dd649558dfb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-starsb5d1ec33-0312-458a-96aa-dd649558dfb7-415x250-IndiaHerald.jpgకొంత కాలం నుంచి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తోంది. ఇప్పటి దాకా అత్యధిక కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి సౌత్ సినిమాలు.బాహుబలి , ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ ఇంకా కాంతార సినిమాలు సృష్టించిన సెన్సెషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇప్పుడు దక్షిణాది చిత్రాలని నార్త్ ఆడియన్స్ చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో సౌత్ మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు బాలీవుడ్ స్టార్స్. కేవలం హీరోగానే కాకుండా విలనిజంతో కూడా మెప్పించేందుకు సిద్ధమవుతన్నారు.BOLLYWOOD STARS{#}Vivek Oberoi;vivek;Ajit Pawar;Rakhta Charitra;Sanjay Dutt;koratala siva;KGF;Saif Ali Khan;vegetable market;Lokesh;Lokesh Kanagaraj;Prabhas;Kannada;Joseph Vijay;ajith kumar;Indian;Romantic;Jr NTR;Audience;Telugu;Director;Tamil;News;India;bollywood;Hero;Cinemaసౌత్ సినిమా ఇండస్ట్రీపై బాలీవుడ్ బిగ్ స్టార్స్ ఫోకస్?సౌత్ సినిమా ఇండస్ట్రీపై బాలీవుడ్ బిగ్ స్టార్స్ ఫోకస్?BOLLYWOOD STARS{#}Vivek Oberoi;vivek;Ajit Pawar;Rakhta Charitra;Sanjay Dutt;koratala siva;KGF;Saif Ali Khan;vegetable market;Lokesh;Lokesh Kanagaraj;Prabhas;Kannada;Joseph Vijay;ajith kumar;Indian;Romantic;Jr NTR;Audience;Telugu;Director;Tamil;News;India;bollywood;Hero;CinemaSun, 23 Apr 2023 09:18:00 GMTకొంత కాలం నుంచి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తోంది. ఇప్పటి దాకా అత్యధిక కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి సౌత్ సినిమాలు.బాహుబలి , ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ ఇంకా కాంతార సినిమాలు సృష్టించిన సెన్సెషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇప్పుడు దక్షిణాది చిత్రాలని నార్త్ ఆడియన్స్ చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో సౌత్ మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు బాలీవుడ్ స్టార్స్. కేవలం హీరోగానే కాకుండా విలనిజంతో కూడా మెప్పించేందుకు సిద్ధమవుతన్నారు. ఇప్పటికే కేజీఎఫ్ సినిమాతో ప్రతినాయకుడిగా మెప్పించాడు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ వివేక్ ఒబెరాయ్ కూడా ఆల్రెడీ తెలుగులో విలన్ గా ఫేమస్ అయ్యాడు.తెలుగులో రక్త చరిత్ర సినిమాతో పాపులర్ అయిన వివేక్ వినయ విదేయ రామ లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు. అలాగే అజిత్ నటించిన తమిళ్ మూవీలో కూడా నటించారు. ఇక కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ పోషించిన అధీరా పాత్ర ఎంత బాగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాత్రలో సౌత్ ఇండస్ట్రీలో సంజయ్ దత్ డిమాండ్ బాగా పెరిగిపోయింది.


ఈ క్రమంలోనే ప్రస్తుతం లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో విజయ్ దళపతి నటిస్తోన్న లియో చిత్రంలో కూడా సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇంకా అలాగే ప్రభాస్..మారుతి కాంబోలో రాబోతున్న సినిమాతో పాటు రెండు కన్నడ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఒక్కో సినిమాకు సంజయ్ దత్ రూ. 5 నుంచి 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఇప్పటి దాకా హీరోగా నార్త్ ఆడియన్స్ ను రొమాంటిక్ హీరోగా అలరించిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు విలన్ గా భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ చూస్తే ఈ మూవీలో సైఫ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థమవుతుంది. ఇంకా ఇదే కాకుండా.. తాజాగా కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న తారక్ 30 లో కూడా సైఫ్ నటిస్తున్నారు.ఈ మూవీ కోసం సైఫ్ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ ఇద్దరు స్టార్స్ ఇటు సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు.



RRR Telugu Movie Review Rating

ఆ సినీ రాజకీయవేత్తతో ఎఫైర్ పెట్టుకున్న నయనతార?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>