Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kattappac99d3217-0f64-4385-ad81-4996ee6e470d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kattappac99d3217-0f64-4385-ad81-4996ee6e470d-415x250-IndiaHerald.jpgదర్శకతీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది ఈ సినిమా. ఇక అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ సాధించి ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది అని చెప్పాలి. కాగా బాహుబలి సినిమాని రెండు భాగాలుగా తెరకేక్కించారు. ఇక ఈ రెండు భాగాల మధ్య ఒక ట్విస్టు పెట్టారు. బాహుబలికి తోడునీడగా ఉన్న కట్టప్ప అతనిని చంపడం మొదటి భాగం. అయితే ఇక రెండో భాగంలో ఎందుకు అలాKattappa{#}Prabhas;Sanjay Dutt;Rajamouli;sathyaraj;bollywood;Telugu;Bahubali;Hero;Master;rana daggubati;tamannaah bhatia;Cinemaఏంటి.. కట్టప్ప క్యారెక్టర్ ని.. ఆ బాలీవుడ్ హీరో వదులుకున్నాడా?ఏంటి.. కట్టప్ప క్యారెక్టర్ ని.. ఆ బాలీవుడ్ హీరో వదులుకున్నాడా?Kattappa{#}Prabhas;Sanjay Dutt;Rajamouli;sathyaraj;bollywood;Telugu;Bahubali;Hero;Master;rana daggubati;tamannaah bhatia;CinemaSat, 22 Apr 2023 08:05:00 GMTదర్శకతీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది ఈ సినిమా. ఇక అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ సాధించి ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది అని చెప్పాలి. కాగా బాహుబలి సినిమాని రెండు భాగాలుగా తెరకేక్కించారు. ఇక ఈ రెండు భాగాల మధ్య ఒక ట్విస్టు పెట్టారు. బాహుబలికి తోడునీడగా ఉన్న కట్టప్ప అతనిని చంపడం మొదటి భాగం. అయితే ఇక రెండో భాగంలో ఎందుకు అలా చంపాల్సి వచ్చింది చూపించారు.



 ఈ సినిమాలో బాహుబలి గా ప్రభాస్ బల్లాలదేవుడిగా రానా ఇక కీలక పాత్రల్లో అనుష్క, రమ్యకృష్ణ, తమన్న నటించారు అని చెప్పాలి. ఇక సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర అయితే బాహుబలి సినిమాకు వెన్నుముకగా నిలిచింది. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా చూసిన తర్వాత కట్టప్ప పాత్రను సత్యరాజ్ తప్ప ఇంకెవరు కూడా అంతలా న్యాయం చేసేవారు కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మాస్టర్ మైండ్ రాజమౌళి మాత్రం కట్టప్ప క్యారెక్టర్ కోసం ముందుగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోని సంప్రదించాడట.



 ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. ఎలాంటి పాత్రలోనైనా సరే లీనమై పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కట్టప్ప పాత్రకు సంజయ్ దత్ అయితే బాగుంటుందని రాజమౌళి అనుకున్నాడట. ఈ క్రమంలోనే సంప్రదింపులు కూడా జరిపాడట. అయితే స్క్రిప్ట్ విన్న సంజయ్ దత్ కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించాడట. దీంతో ఇక ఈ ఛాన్స్ కి నో చెప్పేసాడట. ఆ తర్వాత కట్టప్ప పాత్ర చివరికి సత్యరాజ్ కు దక్కింది. ఇక సత్యరాజ్ కెరియర్ లోనే ఈ పాత్ర ఒక మైల్ స్టోన్ గా నిలిచింది అని చెప్పాలి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ ఈ విషయాన్ని వెల్లడించాడు అని చెప్పాలి. ఇక కే జి ఎఫ్ సినిమాలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటించిన సంజయ్ దత్ ప్రేక్షకులను అలరించాడు అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

సుకుమార్ ఇంట్లో ఆ ఇద్దరి స్టార్ హీరోల ఫోటోలు...!!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>