MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha615094a1-b243-4255-afde-b7a802e42507-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha615094a1-b243-4255-afde-b7a802e42507-415x250-IndiaHerald.jpgమెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత విరూపాక్ష సినిమాతోబిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్‏గా డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎంతగానో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.సినిమాలో ప్రతి సీన్ కూడా ఊహించని ట్విస్ట్‏లో స్టోరీ సాగిపోతుండడంతో ఆడియన్స్ ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉదయం ఫస్ట్ షో నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ మూవీ సాయంత్రానికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ VIRUPAKSHA{#}Blockbuster hit;Bike;Amarnath K Menon;Karthik;Audience;News;Director;Hero;Cinemaప్రేక్షకులకు విరూపాక్ష టీం రిక్వెస్ట్.. ఏంటంటే?ప్రేక్షకులకు విరూపాక్ష టీం రిక్వెస్ట్.. ఏంటంటే?VIRUPAKSHA{#}Blockbuster hit;Bike;Amarnath K Menon;Karthik;Audience;News;Director;Hero;CinemaSat, 22 Apr 2023 14:10:19 GMTమెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత విరూపాక్ష సినిమాతోబిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్‏గా డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎంతగానో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.సినిమాలో ప్రతి సీన్ కూడా ఊహించని ట్విస్ట్‏లో స్టోరీ సాగిపోతుండడంతో ఆడియన్స్ ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉదయం ఫస్ట్ షో నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ మూవీ సాయంత్రానికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో తేజ్ నటన.. కార్తీక్ దండు టేకింగ్ సినీ ప్రియులను ఎంతగానో కట్టిపడేశాయి. దీంతో ఈ  మూవీని చూసేందుకు ఆడియన్స్ బ్రహ్మారథం పట్టారు. ఈ క్రమంలోనే విరూపాక్ష చిత్రయూనిట్ ప్రేక్షకులకు స్పెషల్ రిక్వెస్ట్స్ చేస్తుండడం జరిగింది. ఈ మూవీలో చాలా త్రిల్లింగ్ ట్విస్టులు ఉంటాయని.. వాటిని ముందుగానే లీక్ చేయవద్దని మూవీ టీం వారు కోరారు.'ఈ మూవీలో ఉన్న కీలక అంశాలు ఇంకా ట్విస్టులను దయచేసి ఎక్కడా లీక్ చేయకండి.


వెండితెరపై చూసి ఓ అద్భుతమైన అనుభవాన్ని మీరు పొందండి' అంటూ టీం పేర్కొంది. రుద్రవనం అనే ఊరి చుట్టూ సాగే కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్నో ట్విస్టులు ఇంకా భయాన్ని కలిగించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ కావడంతో తేజ్ చాలా సంతోషంగా ఉన్నారు. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి తేజ్ నటించిన మొదటి చిత్రమిదే. దీంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల స్పందన చూసి సాయి తేజ్ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.ఈ మూవీలో తేజ్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటి దాకా హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మూవీలో మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లుగా చూస్తుంటే తెలుస్తోంది. అయితే మొదటి నుంచి వరుస హిట్స్ అందుకుంటున్న సంయుక్త మీనన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రావడం మాత్రం ఖాయమని సమాచారం తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఫస్ట్ టైం "ఒకే ఒక జీవితం" మూవీకి బుల్లితెరపై వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>