MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood89984f78-ff7f-4a68-93a3-870cb6ec8ade-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood89984f78-ff7f-4a68-93a3-870cb6ec8ade-415x250-IndiaHerald.jpg‘పుష్ప’ ‘కాంతారా’ ‘కేజీ ఎఫ్ 2’ ‘కార్తికేయ 2’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలను బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడంతో దక్షిణాది సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని భావించి తెలుగులో విడుదల అవుతున్న భారీ సినిమాలు అన్నింటినీ బాలీవుడ్ లో కూడ ఒకేసారి విడుదల చేసి పాన్ ఇండియా మూవీలుగా ప్రమోట్ చేసారు.లేటెస్ట్ గా తెలుగులో రిలీజ్ అయిన నాని ‘దసరా’ సమంత ‘శాకుంతలం’ సినిమాలను ఎంత ఎక్కువగా బాలీవుడ్ లో ప్రమోట్ చేసినప్పటికీ ఈరెండు సినిమాలకు కనీసపు కలక్షన్స్ బాలీవుడ్ లోtollywood{#}Nani;Samantha;India;Hindi;Industry;Tollywood;Telugu;Audience;bollywood;Newsపాన్ ఇండియా సైలెన్స్ తో మధన పడుతున్న టాలీవుడ్ !పాన్ ఇండియా సైలెన్స్ తో మధన పడుతున్న టాలీవుడ్ !tollywood{#}Nani;Samantha;India;Hindi;Industry;Tollywood;Telugu;Audience;bollywood;NewsFri, 21 Apr 2023 09:00:00 GMT‘పుష్ప’ ‘కాంతారా’ ‘కేజీ ఎఫ్ 2’ ‘కార్తికేయ 2’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలను బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడంతో దక్షిణాది సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని భావించి తెలుగులో విడుదల అవుతున్న భారీ సినిమాలు అన్నింటినీ బాలీవుడ్ లో కూడ ఒకేసారి విడుదల చేసి పాన్ ఇండియా మూవీలుగా ప్రమోట్ చేసారు.


లేటెస్ట్ గా తెలుగులో రిలీజ్ అయిన నాని ‘దసరా’ సమంత ‘శాకుంతలం’ సినిమాలను ఎంత ఎక్కువగా బాలీవుడ్ లో ప్రమోట్ చేసినప్పటికీ ఈరెండు సినిమాలకు కనీసపు కలక్షన్స్ బాలీవుడ్ లో రాకపోవడంతో బాలీవుడ్ ప్రేక్షకులు పాన్ ఇండియా మూవీ అంటూ ప్రమోట్ చేసిన ప్రతి సినిమాను పట్టించుకోరు అన్నవిషయం స్పష్టం అయింది. వాస్తవానికి నాని బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ బాలీవుడ్ కు బాగా పరిచయం అయిన సమంత ‘శాకుంతలం’ ను కూడ అక్కడ పట్టించుకోలేదు.


కొనసాగుతున్న ఈ పాన్ ఇండియా మ్యానియాతో సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘వాల్తేర్ వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ సినిమాలను హిందీలో డబ్ చేసి విడుదల చేస్తే కనీసం ధియేటర్లలో 10శాతం ప్రేక్షకులు కూడ లేకపోవడంతో ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడ తెలియలేదు. దీనితో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఆలోచనలు మారి త్వరలో విడుదల కాబోతున్న ‘ఏజెంట్ ‘విరూపాక్ష’ ‘వినోదయ సితం’ ‘కష్టడీ’ ‘భోళా శంకర్’ ‘ఖుషీ’ సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తూ హిందీ మార్కెట్ వైపు వెళ్ళకూడదని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


దీనితో రానున్న రోజులలో తెలుగులో నిర్మాణం జరుపుకునే ప్రతి భారీ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ అవకాశాలు లేవనీ కేవలం ఆ సినిమాల కంటెంట్ పాన్ ఇండియా స్థాయిలో ఉంటే మాత్రమే ఆసినిమాలను పాన్ ఇండియా మూవీలుగా విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు అభిప్రాయ పడుతున్నారు..







RRR Telugu Movie Review Rating

దారుణం : పెళ్లి మండపంలో.. వధూవరులపై యాసిడ్ దాడి?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>