MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mammootty4467b2c1-a726-492a-9cd5-33fcb84de219-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mammootty4467b2c1-a726-492a-9cd5-33fcb84de219-415x250-IndiaHerald.jpgమలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ హీరో మెగాస్టార్‌ మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) ఈరోజు (ఏప్రిల్‌21) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తన తుదిశ్వాస విడిచారు.ఫాతిమా మరణంతో మమ్ముట్టి ఫ్యామిలీలో చాలా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఇంకా అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.ఇక కొచ్చిలోని చెంబు ప్రాంతానికి చెందిన ఫాతిమా తన సోదరసోదరిమణులతో కలిసి నివసిస్తోంది. ఆమె అంతిమ సంస్కారాలను చెంబులోని మసీదులMAMMOOTTY{#}Mahanati,Thiruvananthapuram,Yatra,Dalapathi,Reddy,surya sivakumar,News,Telugu,Mammootty,Hero,India,CM,Joseph Vijay,Cinemaమలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి మాతృవియోగం!మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి మాతృవియోగం!MAMMOOTTY{#}Mahanati,Thiruvananthapuram,Yatra,Dalapathi,Reddy,surya sivakumar,News,Telugu,Mammootty,Hero,India,CM,Joseph Vijay,CinemaFri, 21 Apr 2023 15:10:00 GMTహీరో మెగాస్టార్‌ మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) ఈరోజు (ఏప్రిల్‌21) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తన తుదిశ్వాస విడిచారు.ఫాతిమా మరణంతో మమ్ముట్టి ఫ్యామిలీలో చాలా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఇంకా అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.ఇక కొచ్చిలోని చెంబు ప్రాంతానికి చెందిన ఫాతిమా తన సోదరసోదరిమణులతో కలిసి నివసిస్తోంది. ఆమె అంతిమ సంస్కారాలను చెంబులోని మసీదులోనే నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది. ఈరోజు సాయంత్రమే అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మమ్ముట్టి తల్లి మరణంతో మలయాళ చిత్రసీమలో చాలా తీవ్ర విషాదం అలుముకుంది. పలువురు సినీ నటులు ఆమె మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మలయాళీ అయినా మమ్ముట్టికి తెలుగు నాట కూడా చాలా మంచి ఫాలోయింగ్‌ ఉంది. స్వాతికిరణం, సూర్య పుత్రులు ఇంకా దళపతి వంటి చిత్రాలతో ఆయనకు టాలీవుడ్‌ ప్రేక్షకులతో మంచి అనుభందం అనేది ఏర్పడింది.


అలాగే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో కూడా లీడ్‌ రోల్‌ పోషించారు. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తోన్న ఏజెంట్ సినిమాలో కూడా కీ రోల్‌ పోషించారు. మరో వారం రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోనే ఆయన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది.ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్‌ గతేడాది 'సీతారామం'సినిమాతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా మమ్ముట్టి తల్లి మరణంపై తిరువనంతపురం ఎంపీ అయిన శశిథూరూర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ' నేడు ఉదయమే మమ్ముట్టితో మాట్లాడాను.ఆయన తల్లిగారి మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అమ్మలేని లోటు అనేది పూడ్చలేనిది. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేలా మమ్ముట్టికి ధైర్యాన్ని అందించాలని దేవుణ్ణి కోరుతున్నాను' అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు శశిథరూర్‌.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్..?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>