HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tomato-pickle16dcbc57-a3db-44b1-b480-500f41343d42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tomato-pickle16dcbc57-a3db-44b1-b480-500f41343d42-415x250-IndiaHerald.jpgటమాట నిల్వ పచ్చడిని తయారు చేసుకోవడానికి మనం ఖచ్చితంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ టమాటాలను మిక్సీ పట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా కూడా మనం టమాట నిల్వ పచ్చడిని చాలా సులభంగా ఇంకా టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన విధంగా చేసే టమాట నిల్వ పచ్చడి మధ్య మధ్యలో టమాట ముక్కలు తగులుతూ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.ఇక సులభంగా, రుచిగా టమాట నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక టమాట నిలTOMATO PICKLE{#}garlic,Tamarind,Dried Red Chillies,Curry leaves,Turmeric,Air,Gas Stove,Red chilly powder,salt,oil,Mixie,Manamమిక్సీ, రుబ్బే పని లేకుండా టమాట పచ్చడి ఇలా చేసుకోండి?మిక్సీ, రుబ్బే పని లేకుండా టమాట పచ్చడి ఇలా చేసుకోండి?TOMATO PICKLE{#}garlic,Tamarind,Dried Red Chillies,Curry leaves,Turmeric,Air,Gas Stove,Red chilly powder,salt,oil,Mixie,ManamFri, 21 Apr 2023 19:51:00 GMTమిక్సీ పట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా కూడా మనం టమాట నిల్వ పచ్చడిని చాలా సులభంగా ఇంకా టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన విధంగా చేసే టమాట నిల్వ పచ్చడి మధ్య మధ్యలో టమాట ముక్కలు తగులుతూ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.ఇక సులభంగా, రుచిగా టమాట నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక టమాట నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..తరిగిన టమాటాలు – అరకిలో, చింతపండు – చిన్న నిమ్మకాయంత, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 15, ఎండుమిర్చి – 4, మెంతి పొడి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్ ఇంకా కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్ అలాగే కరివేపాకు – ఒక రెమ్మ కావాలి. వీటితో ఈ టమాటా నిల్వ పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.


టమాట నిల్వ పచ్చడి తయారీ విధానం విషయానికి వస్తే..మీరు ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ నూనె వేడయ్యాక తాళింపు దినుసులు ఇంకా ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు ఇంకా చింతపండు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూతపెట్టి మధ్యస్థ మంటపై టమాట ముక్కలను బాగా మెత్తగా ఉడికించాలి. ఆ టమాట ముక్కలు ఉడికిన తరువాత ఇందులో పసుపు, కారం, ఉప్పు ఇంకా మెంతిపిండి వేసి కలపాలి. తరువాత దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే దాకా ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మరోసారి అంతా కూడా కలుపుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే టమాట పచ్చడి ఈజీగా తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం ఇంకా నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని గాలి తగలకుండా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది.


RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్..?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>