Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl346660db-6e8d-4557-8d49-b874af3c77dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl346660db-6e8d-4557-8d49-b874af3c77dd-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవక పోయినప్పటికీ చాంపియన్ టీం లతో సమానంగానే అభిమానులను సంపాదించుకుంది ఈ టీం. అంతేకాదు విరాట్ అంటే ఆర్సిబి.. ఆర్సిబి అంటే విరాట్ కోహ్లీ అన్న విధంగానే ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. విరాట్ కోహ్లీ లేని ఆర్సిబిని అస్సలు ఊహించుకోలేరు అభిమానులు. అయితే కోహ్లీ అనూహ్యంగా 2021లో టి20, వన్డే కెప్టెన్ గా మాత్రమే కాకుండా అటు ఐపీఎల్ ఆర్సిబి కెప్టెన్ గా కూడIpl{#}VIRAT KOHLI;Chennai;Punjabఈ విజయం.. ఆర్సిబి ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్?ఈ విజయం.. ఆర్సిబి ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్?Ipl{#}VIRAT KOHLI;Chennai;PunjabFri, 21 Apr 2023 07:50:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవక పోయినప్పటికీ చాంపియన్ టీం లతో సమానంగానే అభిమానులను సంపాదించుకుంది ఈ టీం. అంతేకాదు విరాట్ అంటే ఆర్సిబి.. ఆర్సిబి అంటే విరాట్ కోహ్లీ అన్న విధంగానే ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. విరాట్ కోహ్లీ లేని ఆర్సిబిని అస్సలు ఊహించుకోలేరు అభిమానులు. అయితే కోహ్లీ అనూహ్యంగా 2021లో టి20, వన్డే కెప్టెన్ గా మాత్రమే కాకుండా అటు ఐపీఎల్ ఆర్సిబి కెప్టెన్ గా కూడా తప్పుకున్నాడు.


కోహ్లీ నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. అయితే కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత  డూప్లెసెస్ కి సారధ్య బాధ్యతలను అప్పగించింది జట్టు యాజమాన్యం. కానీ కోహ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ కెప్టెన్ గా మారితే ఎంత బాగుండు అని అభిమానులు అందరూ కోరుకున్నారు. కానీ అది జరగదు అని వారికి అర్థమయిపోయింది. కానీ ఎట్టకేలకి కోహ్లీని మరోసారి బెంగళూరు జట్టు కెప్టెన్ గా చూడగలిగారు అభిమానులు. ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రెండేళ్ల తర్వాత మళ్లీ అతను బెంగళూరు నాయకుడిగా వ్యవహరించాడు.



 చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో ఆర్సిబి కెప్టెన్ డూప్లెసిస్ కి పక్క టెముకల గాయమైంది. దీంతో పూర్తిగా కోలుకోని అతను పంజాబ్ మ్యాచ్లో కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చాడు. దీంతో ఇక కెప్టెన్ లేకపోవడంతో సారధ్య బాధ్యతలను విరాట్ కోహ్లీ భుజాన వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన బెంగళూరు జట్టు.. 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కోహ్లీ ఎన్నో రోజుల తర్వాత కెప్టెన్సీ వహించడంతో ఈ విజయం అటు అభిమానులందరికీ ఎంతో స్పెషల్ గా మారింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

మీ కాలేయం.. ఇలా కాపాడుకోండి!?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>