PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/margadarsi-ramoji-jagan95fc9add-91cb-4a0b-be2a-25536a122c7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/margadarsi-ramoji-jagan95fc9add-91cb-4a0b-be2a-25536a122c7f-415x250-IndiaHerald.jpgఎందుకంత సీక్రెట్ గా ఉంచారు ? తీసుకున్న డిపాజిట్లను తిరిగి చెల్లించేసిన తర్వాత ఇక అందులో దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది ? అనేది చాలమందికి కలిగే సందేహమే. అయితే ఇందులోనే అసలు మర్మమంతా ఉంది. అదేమిటంటే డిపాజిటర్లకు, ఖాతాదారుల నుండి తీసుకున్న సుమారు రు. 2600 కోట్లను తిరిగి చెల్లించేసినట్లు స్వయంగా రామోజీయే హైకోర్టులో చెప్పారు. ఇపుడు సుప్రింకోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు. అయితే సమస్య ఏమిటంటే డిపాజిట్లు తిరిగి చెల్లించటానికి రామోజీ రు. 2600 కోట్లు ఎవరి దగ్గరనుండి సేకరించారు ? అన్నది కీలకం. ramoji margadarsi cid vundavalli{#}Kumaar;ramoji rao;MP;June;Undavalliఅమరావతి : రామోజీ అసలు కత ఇపుడే మొదలవుతోందా ?అమరావతి : రామోజీ అసలు కత ఇపుడే మొదలవుతోందా ?ramoji margadarsi cid vundavalli{#}Kumaar;ramoji rao;MP;June;UndavalliThu, 20 Apr 2023 03:00:00 GMT



మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు అసలు కథ తొందరలో మొదలవ్వబోతోంది. మార్గదర్శి కంపెనీ ద్వారా సేకరించిన డిపాజిట్లు, తిరిగి చెల్లింపుల వివరాలను జూన్ 10వ తేదీలోగా  ప్రకటించాల్సిందే అని అత్యున్నత న్యాయస్ధానం సుప్రింకోర్టు రామోజీని ఆదేశించింది. నిజానికి తాజా ఆదేశాలు రామోజీకి పెద్ద దెబ్బనే చెప్పాలి. దాదాపు పదిహేడేళ్ళుగా డిపాజిట్ల వివరాలు, తిరిగి చెల్లించిన వివరాలను బహిర్గతం చేయకుండా రామోజీ సీక్రెట్ గా ఉంచేశారు.





ఎందుకంత సీక్రెట్ గా ఉంచారు ? తీసుకున్న డిపాజిట్లను తిరిగి చెల్లించేసిన తర్వాత ఇక అందులో దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది ? అనేది చాలమందికి కలిగే సందేహమే. అయితే ఇందులోనే అసలు మర్మమంతా ఉంది. అదేమిటంటే డిపాజిటర్లకు, ఖాతాదారుల నుండి తీసుకున్న సుమారు రు. 2600 కోట్లను తిరిగి చెల్లించేసినట్లు స్వయంగా రామోజీయే హైకోర్టులో చెప్పారు. ఇపుడు సుప్రింకోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు. అయితే సమస్య ఏమిటంటే డిపాజిట్లు తిరిగి చెల్లించటానికి రామోజీ రు. 2600 కోట్లు ఎవరి దగ్గరనుండి సేకరించారు ? అన్నది కీలకం.





అలాగే  ఎవరెవరికి ? ఎంతెంత చెల్లించారు ? ఏ రూపాల్లో చెల్లించారన్నది ఇంకా కీలకం. ఉండవల్లి ఆరోపణల ప్రకారం మార్గదర్శిలో బినామీ డబ్బు చాలా ఉంది. డిపాజిట్ దారులు, చెల్లింపుల వివరాలు బయటకు వస్తే మొత్తం బండారమంతా బయటపడుతుంది. అందుకనే డిపాజిట్ దారులు, చెల్లింపుల వివరాలను బయటపెట్టడానికి రామోజీ ఇష్టపడటంలేదు.





ఈ విషయాన్ని పక్కనపెడితే తీసుకున్న డిపాజిట్లు, చిట్ల మొత్తం రు. 2600 కోట్లు తిరిగి చెల్లించేసినట్లు రామోజీ చెప్పారు. డిపాజిట్లు తిరిగి ఇచ్చేయటంతోనే తాను తప్పుచేసినట్లు రామోజీ అంగీకరించినట్లయ్యింది. తప్పుచేసిన వారికి శిక్ష, చేసిన తప్పుకు ఫైన్ కట్టాల్సిందే కదా. ఉండవల్లి లెక్కల ప్రకారం రు. 2600 కోట్ల డిపాజిట్లను వెనక్కిస్తే సరిపోదు. సేకరించిన డిపాజిట్లు రు. 2600 కోట్లకు మూడురెట్లు ఫైన్ కట్టాలట. అంటే రు. 7800 కోట్లు రామోజీ  ఫైన్ కట్టాలి.  దీనిమీద వడ్డీ అదనం+చేసిన తప్పుకు శిక్ష తప్పదు.  అందుకనే జూన్ 10 తర్వాతే అసలు కథ మొదలవ్వబోతోంది. 







RRR Telugu Movie Review Rating

అమరావతి : రామోజీ అసలు కత ఇపుడే మొదలవుతోందా ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>